
శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నిన్న భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సూపర్ ఓవర్ ముగిసిన వెంటనే శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబగే టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి హేళనగా కామెంట్స్ చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నిన్న(సోమవారం) భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. అయితే, ఈ పోరు కేవలం ఆటతోనే కాకుండా మైదానంలో చోటుచేసుకున్న ఘర్షణలు, వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర దుమారం రేపింది. అయితే వైభవ్‌ను ఉద్దేశించి శ్రీలంక ప్లేయర్ చేసిన వ్యాఖ్యలే గొడవకు కారణమని ఓ స్పోర్ట్స్ ఛానల్ పేర్కొంది. సూపర్ ఓవర్ ముగిసిన వెంటనే శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబగే టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి..
'మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లొచ్చు' అంటూ ఎగతాళిగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహానికి గురైన సూర్యవంశీ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఇరు జట్ల ఆటగాళ్లు భౌతికంగా నెట్టుకునే వరకు పరిస్థితి వెళ్లడంతో అంపైర్లు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు.
ఈ ఘటనపై, అలానే స్టేడియంలో తగినంత వెలుతురు లేకపోయినా సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చినందున లంక డ్రెస్సింగ్ రూమ్‌లోనూ చర్చ నడిచిందని, భారత జట్టుకు క్షమాపణలు చెప్పాలని కొందరు లంక సభ్యులు సూచించినట్లు సమాచారం. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి అంపైర్ల పెనాల్టీ నిర్ణయం కూడా ఒక ముఖ్య కారణమైంది.
భారత ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్ పిచ్‌పై నిషేధిత ప్రాంతంలో పరుగెత్తాడనే కారణంతో అంపైర్లు ప్రగీత్ రాంబుక్వెల్లా, శాంత ఫొన్సేకా భారత్‌కు 10 పరుగుల పెనాల్టీ విధించారు. ఫలితంగా శ్రీలంక ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే
వారి ఖాతాలో 10 పరుగులు చేరాయి. చివరికి అదే 10 పరుగులు భారత జట్టు ఓటమిని శాసించడం గమనార్హం. ఒక 'ఎ' టీమ్ మ్యాచ్‌లో ఇంతటి ఉత్కంఠ, వివాదాలు చోటుచేసుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉత్కంఠభరితంగా సాగిన బెల్జియం, ఈజిప్ట్‌ల మ్యాచ్
ఇరాన్ అభిమానులకు షాకిచ్చిన అమెరికా కోర్టు