
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Special Intensive Revision in Telangana State: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం.. ‘సర్’ ఓటరు జాబితా ప్రత్యక సమగ్ర సవరణ కార్యక్రమం ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది.
అటు అక్టోబర్ 1 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ముగుస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు స్వయంగా వచ్చి ఓటర్ల వివరాల ఫారాలను పంపిణీ చేస్తారు. వాటి ద్వారా ఆయా వ్యక్తుల పూర్తి వివరాలు సేకరిస్తారు.
ఓటర్లు ఆన్లైన్ ద్వారా కూడా వెబ్సైట్లో ఈ ఫారాన్ని సమర్పించవచ్చని ఈసీ స్పష్టం చేసింది. ఎన్యూమరేషన్ ఫారాల ద్వారా సేకరించిన సమాచారంతో జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఆగస్టు 30 వరకు ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
ఒకవేళ కొత్తగా చిరునామా మార్చుకోవాలంటే ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు బీఎల్వోలు అడిగే పత్రాలను సమర్పించాలి. 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండే యువతీ, యువకులు కొత్తగా ఓటు హక్కు కోసం ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ అవకాశమిచ్చింది.
కుటుంబ సభ్యులు ఎవరైనా ఊర్లో లేకపోయినా, విదేశాల్లో ఉన్నా వారి తరఫున ఇంట్లోని పెద్దలు ఫారాలపై సంతకం చేసి బీఎల్ఓలకు అందించవచ్చు. ఏవైనా సందేహాలుంటే ఓటర్లు 1950 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్
రివిజన్లో ముందుగా చనిపోయిన వారిని ఓటర్ల జాబితా తెలిగిస్తారు. వారితో పాటు స్థానికంగ పని చేస్తోన్న చోటుతో పాటు తమ స్వస్థాల్లో ఓటు హక్కు ఉన్నవాళ్లు ఏదో ఒక చోట మాత్రమే తన ఓటు హక్కును ఉంచుకోవాలి. ఇవన్నీ సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో బీఎల్వోలు ఇంటింటికి తిరిగి ఈ జాబితాను చెక్ చేస్తారు. ఏది ఏమైనా ఓట్ల తొలగింపు, చేర్పుల వ్యవహారం భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపనుండడంతో జాగ్రత్తపడుతున్నాయి. ఎన్నికల సంఘం ఫైనల్ డెసిషన్ తీసుకున్నాక తీరిగ్గా స్పందిస్తే లాభం లేదని భావించి.. ఇప్పటి నుంచే ముందస్తు చర్యలకు రెడీ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.