
Anitha vs Amaranth : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. వైసీపీ సర్కారులో మాజీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్, ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి ‘మేకప్ మంత్రి’ అని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి.
ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులు, మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఒక మహిళా మంత్రిని, అది కూడా రాష్ట్ర శాంతిభద్రతలను పర్యవేక్షించే హోంమంత్రిని పట్టుకుని వ్యక్తిగత రూపం, ఆహార్యంపై ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతికి తగదని టీడీపీ నేతలు గట్టిగా కొట్టిపారేస్తున్నారు.
అమర్నాథ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని కూటమి శ్రేణులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. Read Also : రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం: ఎమ్మెల్యే సురేంద్రబాబు! ఈ వివాదంపై టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందిస్తూ..
ప్రతిపక్ష నేతలు మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హితవు పలికారు. మరోవైపు వైసీపీ నేతల వైఖరిపై టీడీపీ మహిళా ఎంపీ శబరి అత్యంత ఘాటుగా స్పందించారు. మహిళలపై గౌరవం లేకుండా మాట్లాడితే భవిష్యత్తులో మహిళా లోకమే వైసీపీ నేతల నాలుకలు కోస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
గత ప్రభుత్వంలోనూ మహిళా నేతలపై ఇలాంటి వ్యక్తిగత దాడులు చేయడం వల్లే ప్రజలు వారికి బుద్ధి చెప్పారని, అయినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలు ఏపీలో రాబోయే రోజుల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత ఘర్షణ వాతావరణానికి దారితీసేలా కనిపిస్తున్నాయి.
‘The Order of the White Double Cross’ : ప్రధాని మోదీకి స్లొవేకియా అత్యున్నత పురస్కారం గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల
కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
TG Bharat: మంత్రి టీజీ భరత్‌ను కలిసిన ఆర్యవైశ్య సంఘం నేతలు!
Tadipatri Politics:జేసీ-కేతిరెడ్డి వివాదంలో మంత్రి టీజీ భరత్ ఎంట్రీ!
Two-Year Trust Program:సంక్షేమ పాలనపై లబ్ధిదారుల ప్రశంసల వెల్లువ!
kalyandurg seed distribution:రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం: ఎమ్మెల్యే సురేంద్రబాబు!
EO Srinivasa Rao: శ్రీశైలంలో భక్తుల సౌకర్యాలపై ఈవో సమీక్ష!
Prakash Raj: రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు