
రొయ్యల ఫీడ్ ధరల నియంత్రణ. శాశ్వత రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు. ఆక్వా రైతుల వ్యయాల తగ్గింపు. Atchannaidu: ఏపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి ప్రయోజనాలే ధ్యేయంగా రొయ్యల ఫీడ్ (మేత) ధరల పర్యవేక్షణకు శాశ్వత రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
పశుసంవర్ధక, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ 180ని జారీ చేశారు. ఫీడ్ ధరల నియంత్రణ, పారదర్శకత కోసం ఈ 'ఏపీ శ్రింప్ ఫీడ్ ఇన్‌గ్రిడియెంట్స్ ప్రైస్ మానిటరింగ్ కమిటీ' పనిచేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) ప్రకటించారు.
Telangana: తెలంగాణకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా స్వీకరణ కమిటీ బాధ్యతలు & సాంకేతికత: ఈ కమిటీ రొయ్యల మేత తయారీ ఖర్చులు, రవాణా వ్యయాలతో పాటు ఫిష్‌మీల్, సోయాబీన్ వంటి ముడి పదార్థాల ధరలను శాస్త్రీయంగా అంచనా వేస్తుంది.
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ రైతులకు సరైన సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఫీడ్ నాణ్యతను కాపాడటానికి, ధరల సమీక్ష కోసం డిజిటల్ యాప్, ఐఓటీ (IoT) సాంకేతికతను ఉపయోగించనున్నారు. లక్ష్యాలు & ప్రయోజనాలు: కాకినాడ SIFT ప్రిన్సిపాల్ కన్వీనర్ గా వ్యవహరించే ఈ కమిటీలో MPEDA, CIBA, ఫిషరీస్ యూనివర్సిటీ ప్రతినిధులతో పాటు ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, డీలర్లు సభ్యులుగా ఉంటారు.
తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ మేత పదార్థాలపై పరిశోధనలను ఈ కమిటీ ప్రోత్సహిస్తుంది. ఆక్వా రైతుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
.