
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Best Retirement Schemes: రిటైర్మెంట్ తర్వాత చాలామంది సురక్షితమైన క్రమబద్ధమైన ఆదాయం అందించే పెట్టుబడి మార్గాల గురించి అన్వేషిస్తుంటారు. అందులో ఫిక్స్ డిపాజిట్ తోపాటు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి.
అయితే ఈ మధ్యకాలంలో అనేక బ్యాంకుల్లో సీనియర్ సిటిజెన్లకు 8 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అందులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ప్రస్తుతం 8.2శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లు..
వర్సెస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఈ రెండింట్లో ఏది అత్యంత ప్రయోజనం అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వయోవృద్ధుల కోసం బ్యాంక్ ఎఫ్డీ వడ్డీరేట్లు బ్యాంకును బట్టి.. కాలపరిమితిని బట్టి మారుతుంటాయి. అయితే చిన్న ఫైనాన్స్ బ్యాంకులో సీనియర్ సిటిజన్స్ కు 8.30% వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సీనియర్ సిటిజనులకు 7.4.5% నుండి 8% వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఎఫ్‌డీల్లో అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే వాటి సౌకర్యం అని చెప్పాలి. ఇన్వెస్టర్లు తమ అవసరాలు బట్టి కొన్ని రోజుల నుండి 10 సంవత్సరాల వరకు కాలపరిమితిని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
చాలా బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్ గడువుకు ముందే మూసివేసే సౌకర్యం కూడా అందిస్తుంటాయి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వం భరోసా కల్పిస్తున్న ఒక పొదుపు పథకం. ఇది ఏప్రిల్ జూన్ 2026 త్రైమాసికానికి 8.2% వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది.
స్కీం వడ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. రిటైర్మెంట్ చేసే వారికి క్రమబద్ధమైన ఆదాయ వనరుగా ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది సీనియర్ సిటిజన్స్ దీనిని పెన్షన్లు లాంటి ఆదాయ ఎంపికగా భావిస్తుంటారు.
కేవలం వడ్డీరేట్లపరంగా చూస్తే కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులో పై 8.3% వరకు రాబడిని అందిస్తున్నాయి. అయితే వీటిని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ కంటే కొంచెం ఎక్కువగా ప్రమాదకరమైనవిగా పరిగణించవచ్చు. ప్రభుత్వం మద్దతు ఉన్న పథకం కాబట్టి ఇది మెరుగైన భద్రతను అందిస్తుంది. ఫిక్స్ డిపాజిట్లకు గరిష్ట పెట్టుబడి పరిమితి అంటూ లేనప్పటికీ ఈ స్కీం లో పెట్టుబడులకు నిర్దిష్టమైన పెట్టుబడి పరిమితి ఉంటుంది. మరోవైపు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడుదారులకు స్థిరమైన హామీతో కూడిన ఆదాయ భరోసాను అందిస్తుంది. ఇది రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్థిరత్వానికి కీలకంగా మారే అవకాశం ఉంటుంది.
అయితే ఈ రెండు స్కీం లలో ఏది బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకోవాలి అనుకుంటే.. మీ ప్రాధాన్యత గరిష్ట మూలధన రక్షణ.. క్రమమైన ఆదాయం అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే మీరు పలు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పోల్చి చూసుకొని అధిక రాబాడిని పొందాలనుకున్నట్లయితే కొంచెం ఎక్కువ రిస్కు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే సీనియర్ సిటిజన్ ఎఫ్ డి లు కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. చాలామంది ఆర్థిక నిపుణులు రిటైర్మెంట్ చేసిన వ్యక్తులు తమ పొదుపును కేవలం ఒకే ఎంపికలో కాకుండా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్, బ్యాంక్ ఎఫ్‌డిలు రెండింట్లోనూ పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే.. ఇది భద్రత రాబడి మధ్య మెరుగైన సమతుల్యతను సృష్టిస్తుంది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఈ స్కీం ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రభుత్వ హామీతో కూడిన పెట్టుబడికి బలమైన భద్రతను కల్పిస్తుంది. ఈ