
ఇంటర్నెట్ డెస్క్: దంబుల్లాలో శ్రీలంక Aతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇండియా A ఓడిపోయింది. మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో శ్రీలంక 16 పరుగులు చేసింది. అనంతరం ఇండియా A 9 పరుగులే చేసింది. చివరి మూడు బంతులకు స్ట్రైకింగ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీ ఆరు పరుగులే చేశాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో భారత ఓపెనర్లను కొంతమంది శ్రీలంక ఆటగాళ్లు ఏదో అన్నట్లు తెలుస్తోంది. వెంటనే సుర్యాంశ్ షెడ్గే లంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన సూర్యవంశీ ఈ గొడవలోకి వెళ్లి లంక ప్లేయర్ ఛాతీపై చేయి నెట్టాడు.
ఆ క్రికెటర్ కూడా ప్రతిఘటించడంతో వివాదం మరింత పెద్దది అయ్యేలా కనిపించింది. దీంతో లంక వికెట్‌కీపర్ నిరోషన్ డిక్వెల్లా మధ్యలో కలుగజేసుకుని వైభవ్‌ను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లాడు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ప్రారంభించినప్పటికీ వైభవ్ శాంతించలేదు.
పెవిలియన్ వైపు వెళ్తూ శ్రీలంక ప్లేయర్లను చూస్తూ ఏదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హైదరాబాద్‌లో ఐపీఎల్ తరహాలో క్రికెట్ సందడి మొదలుకానుంది. యువ ప్రతిభను వెలికితీయడంతోపాటు తెలంగాణ క్రికెట్‌కు కొత్త ఉత్సాహం తీసుకురావాలనే లక్ష్యంతో హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది
.