
హైదరాబాద్: మెట్రో రెండో దశకు అనుమతి దక్కకపోవడం సీఎం రేవంత్‌రెడ్డి (Revnath Reddy) అసమర్థ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. 71 సార్లు ఆయన దిల్లీకి వెళ్లినా భాజపా పట్టించుకోవడం లేదన్నారు.
ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘‘తెలంగాణ ప్రయోజనాలపై ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి ప్రశ్నించలేకే ప్రతిపక్షంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. మెట్రో రెండో దశ సాధించడంలో అట్టర్‌ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలి.
హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దే. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 28 శాతం పనులు కూడా పూర్తిచేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసింది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తిచేయించారు.
గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ, నగర విస్తరణ, ప్రజల రోజువారీ అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది. రేవంత్ కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉనికిలో లేని ఊహా నగరానికి మెట్రో రెండో దశను ప్రతిపాదించారు. ఎల్‌అండ్‌టీపై బెదిరింపులు, ఆస్తులు కొల్లగొట్టే కుట్రతోనే ఆ సంస్థ పారిపోతోంది’’ అని కేటీఆర్ ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అమ్మ ప్రేమను, అవకాయ రుచిని, హైదరాబాద్ నగరాన్ని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నాయి.
బడిబాట పట్టారు. పాఠశాలలకు తొలిరోజు వస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. అల్పాహారం ఏర్పాటు చేశారు. ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. వేసవి సెలవులతో బోసిపోయిన పాఠశాలలు సందడిగా మారాయి.
దీంతో విద్యార్థులు