
Prakash Raj: ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి న్యాయస్థానంలో సోమవారం ఒక క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. రామాయణం, హిందూ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మతపరమైన విశ్వాసాలను, మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని ఆరోపిస్తూ బీజేపీ సీనియర్ నాయకుడు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి.
భానుప్రకాశ్ రెడ్డి ఈ చట్టపరమైన చర్యలు చేపట్టారు. తిరుపతిలోని నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. Read also: Chandrababu Naidu: సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ భానుప్రకాశ్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..
కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌తో పాటు పలు ఇతర బహిరంగ వేదికలపై ప్రకాశ్ రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఉత్తర భారతదేశానికి చెందిన శ్రీరాముడు, లక్ష్మణుడు దక్షిణాదిపై (లంకగా పోలుస్తూ) దండయాత్ర చేశారంటూ ఆర్యులు-ద్రావిడుల మధ్య విభజనను, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ మాట్లాడారని పిటిషనర్ ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలు ముమ్మాటికీ వాస్తవ విరుద్ధమని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ పవిత్ర గ్రంథాలను, దేవతలను ఉద్దేశపూర్వకంగా కించపరిచినందుకు గానూ భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 299, 196 కింద నటుడిపై కేసు నమోదు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు.
సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన ప్రకాశ్ రాజ్ వీడియోలు ఏప్రిల్ 17న తన దృష్టికి వచ్చాయని భానుప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. హిందూ సమాజంలో విద్వేషాలు రగిల్చేలా సాగిన ఆ ఉపన్యాసంపై తాను ఏప్రిల్ నెలలోనే ప్రకాశ్ రాజ్‌కు లీగల్ నోటీసులు పంపినట్లు ఆయన గుర్తుచేశారు.
నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో తాజాగా ఆయన కోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ ఫిర్యాదును తిరుపతి కోర్టు విచారణకు స్వీకరించింది.
Weight Loss Breakfast: బరువు తగ్గడానికి ఉదయం పూట తినాల్సిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Chandrababu Naidu: సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Nara Lokesh: సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. రాష్ట్ర ప్రగతి కోసం ప్రత్యేక పూజలు
Ap govt: ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
Annadata Sukhibhava Scheme AP:జూన్ నెలాఖరులోగా ‘అన్నదాత సుఖీభవ’ నిధులు.. అకౌంట్లలోకి రూ.20 వేలు!
Pawan Kalyan: ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
Pawan Kalyan: కాక్రోచ్ జనతా పార్టీ’పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అప్పట్లోనే హెచ్చరించారు. నటుడి వైపు