సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా సోమవారం రోజున సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీ సందర్భంగా టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూనివర్సిటీల్లో పరిశోధనలు వంటి అంశాలపై చర్చించారు.
అలాగే సెమీ కండక్టర్ల తయారీ ఎకోసిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్‌లో సహకారం అందించాలని సింగపూర్ ప్రధానమంత్రిని చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఎయిర్ పోర్టులు, పోర్టుల అభివృద్ధిలో కలిసి పనిచేద్దామని కోరారు.
అలాగే సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పరిపాలనాపరమైన సంస్కరణల అమలుపై చర్చించారు. గుడ్ గవర్నెన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని గువాన్ను చంద్రబాబు ఆహ్వానించారు.సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివియన్ బాలక్రిష్ణన్తో భేటీ అయిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ - సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించారు. అలాగే సీఐఐ ఏపీ బిజినెస్ డెలిగేషన్‌తో సమావేశమై... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని వివరించారు.ఈ విషయాన్ని విదేశాల్లో బ్రాండ్ చేసే బాధ్యతను పారిశ్రామిక వేత్తలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
ఇతర దేశాల్లో ఉన్న టెక్నాలజీని, వ్యాపారాన్ని రాష్ట్రానికి పరిచయం చేయాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి సెమీ కండక్టర్ వరకు బెస్ట్ పాలసీలతో సిద్ధంగా ఉన్నామన్న చంద్రబాబు.. అవసరం అయితే విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో పరిశ్రమలు స్థాపించాలని కోరారు.
మరింత విస్తరించేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సంజీవని ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని చంద్రబాబు వారిని కోరారు.
అంతకుముందు గూగుల్ క్లౌడ్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై చర్చించారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని