
మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీది రోహిణి నక్షత్రం, ఒకటో పాదం, వృషభ రాశి, తులా లగ్నం. మీ జాతకంలో దశమాధిపతి చంద్రుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉండాల్సి వస్తోంది. ఇంచుమించుగా ప్రతి నాలుగు నుంచి ఐదేళ్లకోసారి ఉద్యోగాలు మారాల్సి వచ్చే అవకాశాలు ఉంటాయి.
అయితే, సంపాదన స్థిరంగా ఉంటుంది గనక ఈ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. 2026 డిసెంబర్ నుంచి మీకు శని మహాదశ ప్రారంభం అవుతుంది. 2027 మార్చి నుంచి మే నెలల్లో మీకు మళ్ళీ స్థానచలనం ఉండే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయండీ.
2027 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మీరు భారతదేశం వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభం జయం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.