
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ చిన్న పక్షి చూపిన తల్లిప్రేమకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ చిన్న పక్షి చూపిన తల్లిప్రేమకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. లాప్వింగ్ (Lapwing) జాతికి చెందిన ఓ తల్లి పక్షి తన గుడ్లను కాపాడేందుకు భారీ ట్రాక్టర్‌కు ఎదురొడ్డి నిలబడిన దృశ్యం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది.
wandarlustbabbi21 అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Lapwing bird viral video). వైరల్ అవుతున్న వీడియోలో ఒక పక్షి పొలంలో గుడ్లు పెట్టి వాటిని కాపలా కాస్తోంది. అదే సమయంలో రైతు ట్రాక్టర్‌తో ఆ దిశగా వస్తుండటాన్ని గమనించింది.
ఆ ట్రాక్టర్ చక్రానికి ఎదురుగా నిలబడి తన రెక్కలను విప్పి గుడ్ల ముందు నిలబడింది. తన పిల్లలను రక్షించేందుకు ప్రాణాలకు తెగించి నిలిచిన ఆ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. పక్షి భయపడకుండా గుడ్లను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న తీరు చూసిన రైతు ట్రాక్టర్‌ను వెంటనే ఆపేశాడు (Mother bird protects eggs).
ఆ తర్వాత పక్షి, గుడ్లకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్త పడ్డాడు (Tractor viral video). ఈ ఘటనలో పక్షి మాతృత్వం మాత్రమే కాదు, రైతు చూపిన మానవత్వం కూడా ప్రశంసలు అందుకుంటోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'తల్లి ప్రేమకు హద్దులు లేవు', 'మనుషులైనా, జంతువులైనా పిల్లల కోసం ప్రాణాలు అర్పిస్తారు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం.. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ
..