
Ayesha Naseem Story: 2026 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై సూపర్ విక్టరీతో టీమిండియా బోణీ కొట్టింది. పాక్‌పై 64 పరుగుల తేడాతో గెలుపొందింది. దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టి.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ ఓటమి తరువాత పాకిస్థాన్ అభిమానులు ఓ యువ మహిళా క్రికెటర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. మతపరమైన కారణాలతో 18 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించి అయేషా నసీమ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.. పాకిస్థాన్ మహిళా క్రికెటర్ అయేషా నసీమ్ కేవలం 18 ఏళ్ల వయసులోనే మతపరమైన కారణాలను పేర్కొంటూ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది.
అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు జూలై 2023లో ప్రకటించింది. అప్పట్లో తన నిర్ణయం గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు వ్యక్తిగతంగా తెలియజేయగా.. ఆ తర్వాత పీసీబీ దానిని ధృవీకరించింది. వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి వైదొలగాలన్న అయేషా నసీమ్ నిర్ణయాన్ని పీసీబీ అర్థం చేసుకుని..
గౌరవిస్తుందని పాక్ క్రికెట్ బోర్డు అప్పట్లో తెలిపింది. 2004 ఆగస్టు 7న అబోటాబాద్‌లోని బగన్ అనే చిన్న గ్రామంలో జన్మించిన నసీమ్.. కనీసం మహిళలు బయటకు అడుగుపెట్టేందుకు ఒప్పుకోని సమాజంలో పెరిగింది. ఇక క్రికెట్ గురించి అక్కడ ఊహించడం కూడా కష్టమే.
తన సోదరుడితో కలిసి క్రికెట్ ఆడేందుకు కరాచీకి వెళ్లింది. 2015లో అబోటాబాద్‌కు తిరిగి వచ్చిన తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. "నేను క్రికెట్ ఆడుతున్నందుకు అందరూ విమర్శించారు. ఒక్కరూ కూడా ఎంకరేజ్ చేయలేదు. నేను క్రికెట్ ఆడుతుంటే..
తమ కుమార్తెలపై చెడు ప్రభావం చూపుతున్నానని తిట్టారు.." అని అయేషా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. నసీమ్ 15 ఏళ్ల వయసులో 2020 మార్చి 3న ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ను ఆరంభించింది. పాక్ తరుఫున అరంగేంట్రం చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది
. ఆ తర్వాత 2021 జూలై 12న వెస్టిండీస్ మహిళల టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె వన్డేల్లో ఎంట్రీ ఇచ్చింది.
పాకిస్థాన్ తరపున 4 వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన నసీమ్.. ఆమె వన్డేలలో 33 పరుగులు, టీ20లలో 369 పరుగులు చేసింది. జనవరి 2023లో ఆస్ట్రేలియాపై 20 బంతుల్లో 24 పరుగుల చేసిన తరువాత పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ నుంచి ప్రశంసలు అందుకుంది. గ్రేట్ టాలెంటెడ్ ప్లేయర్ అని అభినందించారు.