
బుధుడు తన స్వక్షేత్రమైన మిథున రాశిలో సంచారం చేస్తుండడం, గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, శుక్రుడు ఆ గురువుతో కలిసి ఉండడం వంటి కారణాల వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మేషం. మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులవారు ఇప్పటి నుంచి జూలై చివరి వరకు అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నారు.
ఈ రాశుల వారు ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంత మంచిది. ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు, విదేశీయానాలు, ఆస్తి లాభాలు వంటివి తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. మేషం: ఈ రాశికి గురు, శుక్ర, బుధ గ్రహాలు మూడూ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరికలు సాకారమయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా వీరి సొంత ఇంటి కల నెరవేరుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల కూడా అపార ధన లాభం కలుగుతుంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో చేరతారు.
ఉన్నత కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. మిథునం: ఈ రాశిలో రాశ్యదిపతి బుదుడు, ద్వితీయ స్థానంలో గురు, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారికి విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందు వల్ల లాభదాయక వ్యవహారాలు, కార్యక్రమాలు చేపడతారు.
ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. కర్కాటకం: ఈ రాశిలో ప్రస్తుతం గురువు ఉచ్ఛ స్థితిలో ఉండి, శుక్రుడితో యుతి చెందడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది.
కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన కోరికలన్నీ నెరవేరుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి
, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడతాయి. విదేశీయానానికి అడ్డంకులు తొలగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడ తారు.
తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో బుదుడు, దశమ స్థానంలోమ గురు, శుక్రుల సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీత భత్యాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు.
మకరం: ఈ రాశికి ప్రస్తుతం గురు, శుక్ర, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
మీనం: ఈ రాశికి రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టడం, శుక్రుడితో కలిసి ఉండడం, చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి బుధుడి సంచారం వల్ల ఊహించని ఆస్తి లాభం, గృహ లాభం కలుగుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లు కనక వర్షం కురిపిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి.