
ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ’19వ ఆటా మహాసభలు, యువ సదస్సు’ జులై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించినట్లు ఆటా సంస్థ వెల్లడించింది.
రాజకీయ ప్రముఖులు .. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు డి.
శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆహ్వానితులలో ఉన్నారు. ఇతర రాజకీయ నాయకులు.. కె.టి. రామారావు, టి. హరీష్ రావు, వేం నరేందర్ రెడ్డి, అరుణ డి.కె., బలరాం నాయక్, ఎన్. రామచందర్ రావు, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, చామకూర మల్లారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సీత దయాకర్ రెడ్డి వంటి ప్రముఖులు ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు.
అలాగే పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. ఈ అంతర్జాతీయ తెలుగు వేదిక కోసం ఆటా కోర్ కమిటీ సభ్యులు జయంత్ చల్లా (అధ్యక్షుడు), శ్రీధర్ బానాల (కన్వీనర్), రవి చల్లా (కోఆర్డినేటర్), శరత్ వేముల (నేషనల్ కోఆర్డినేటర్), సుధీర్ దామిడి (డైరెక్టర్) తదితరులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు
.