
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) రాజకీయ రంగప్రవేశంపై ప్రస్తుతం తమిళనాడుతో పాటు దక్షిణాది చిత్రసీమలో తీవ్ర చర్చ జరుగుతోంది. అదే సమయంలో తాజాగా ప్రెస్ మీట్లో లారెన్స్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు, నటుడు చేరన్ తీవ్రంగా స్పందించారు.
ప్రజలను వీధి కుక్కలతో పోలుస్తూ లారెన్స్ మాట్లాడటం ఎంతమాత్రం సరికాదంటూ చేరన్ మండిపడ్డారు. ఈ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది.తిరుచ్చి తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో లారెన్స్ పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం, మార్పుల గురించి ఆయన చెబుతూ వింత పోలిక తెచ్చారు. కొత్త ఇంట్లోకి మారినప్పుడు బయట ఉండే వీధి కుక్కలు మొరుగుతాయని, వాటికి బిస్కట్లు లేదా బిర్యానీ వేసి శాంతింపజేయాలనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ప్రజలు మార్పును ఆశించి ఓటేశారని, కాబట్టి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరారు.లారెన్స్ చేసిన ఈ పోలిక తీవ్ర వివాదానికి దారితీసింది.
ప్రశ్నించే ప్రజలను, ఓటర్లను ఆయన వీధి కుక్కలతో పోల్చారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్శకుడు చేరన్ స్పందిస్తూ, ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కడానికి ఏదో ఒకటి ఆశ చూపించాలనే లారెన్స్ భావజాలం ఆయన రాజకీయ ప్రయాణం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు.
బిస్కట్లు, బిర్యానీల కోసం ఆశపడని కోట్లాది మంది సామాన్య ప్రజల్లో తాను కూడా ఒకడినని చేరన్ ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ వివాదం ముదరడంతో లారెన్స్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను కొందరు కావాలనే తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు.
అభిమానులు, సాధారణ ప్రజానీకం ఎప్పుడూ తన తల్లితో సమానమని లారెన్స్ చెప్పుకొచ్చారు. ప్రజలను కుక్కలతో పోల్చేంత మానవత్వం లేనివాడిని కాదని, పూర్తి వీడియోను చూస్తే తాను ఏ ఉద్దేశంతో మాట్లాడానో అర్థమవుతుందని ఆయన కోరారు
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) రాజకీయ రంగప్రవేశంపై ప్రస్తుతం తమిళనాడుతో పాటు దక్షిణాది చిత్రసీమలో తీవ్ర చర్చ జరుగుతోంది. అదే సమయంలో తాజాగా ప్రెస్ మీట్లో లారెన్స్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు, నటుడు చేరన్ తీవ్రంగా స్పందించారు. ప్రజలను వీధి కుక్కలతో పోలుస్తూ లారెన్స్ మాట్లాడటం ఎంతమాత్రం సరికాదంటూ చేరన్ మండిపడ్డారు. ఈ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తిరుచ్చి తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో లారెన్స్ పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం, మార్పుల గురించి ఆయన చెబుతూ వింత పోలిక తెచ్చారు. కొత్త ఇంట్లోకి మారినప్పుడు బయట ఉండే వీధి కుక్కలు మొరుగుతాయని, వాటికి బిస్కట్లు లేదా బిర్యానీ వేసి శాంతింపజేయాలనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ప్రజలు మార్పును ఆశించి ఓటేశారని, కాబట్టి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరారు.లారెన్స్ చేసిన ఈ పోలిక తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రశ్నించే ప్రజలను, ఓటర్లను ఆయన వీధి కుక్కలతో పోల్చారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్శకుడు చేరన్ స్పందిస్తూ, ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కడానికి ఏదో ఒకటి ఆశ చూపించాలనే లారెన్స్ భావజాలం ఆయన రాజకీయ ప్రయాణం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు. బిస్కట్లు, బిర్యానీల కోసం ఆశపడని కోట్లాది మంది సామాన్య ప్రజల్లో తాను కూడా ఒకడినని చేరన్ ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ వివాదం ముదరడంతో లారెన్స్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను కొందరు కావాలనే తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. అభిమానులు, సాధారణ ప్రజానీకం ఎప్పుడూ తన తల్లితో సమానమని లారెన్స్ చెప్పుకొచ్చారు. ప్రజలను కుక్కలతో పోల్చేంత మానవత్వం లేనివాడిని కాదని, పూర్తి వీడియోను చూస్తే తాను ఏ ఉద్దేశంతో మాట్లాడానో అర్థమవుతుందని ఆయన కోరారు.