
బూర్గంపహాడ్, జూన్ 15 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీఓ రామకృష్ణ అన్నారు. సోమవారం పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పంచాయతీ పనుల రికార్డులను పరిశీలించారు.
గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పంచాయతీ అభివృద్ధికి అవసరమైన వివరాలు సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్యా మోహన్‌రావును అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని, కార్యదర్శులు పంచాయతీలో వీధిలైట్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం తదితర వాటిపై దృష్టి సారించాలని సూచించారు.
అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్ ఎంపీఓను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగిరెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
.