
దంబుల్లా: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సోమవారం ఇండియా Aతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక A విజయం సాధించింది. స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యఛేదనలో శ్రీలంక ఏ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది.
సూపర్ ఓవర్లో శ్రీలంక 16 పరుగులు చేయగా.. భారత్ 10 పరుగులే చేసింది. 265 పరుగుల లక్ష్యఛేదనలో లంక ఇన్నింగ్స్ 10/0తో మొదలుపెట్టింది. భారత బ్యాటర్ విప్రాజ్ నిగమ్ డేంజర్ ఏరియాలోకి రావడంతో అంపైర్లు పది పరుగులను పెనాల్టీగా విధించి..
శ్రీలంక ఇన్నింగ్స్‌కు కలిపారు. ఈ పెనాల్టీ లేకపోతే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. సదీర సమరవిక్రమ (83; 102 బంతుల్లో 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నిరోషన్ డిక్వెల్లా (37), వనుజ సహన్ (25), అవిష్క ఫెర్నాండో (22), విశేన్ (17) పరుగులు చేశారు.
భారత బౌలర్లలో ఆయుష్ బదోని 2, అర్షద్ ఖాన్, నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అనుకుల్ రాయ్, సుర్యాంశ్ ఒక్కో వికట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఏ టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. 125 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన జట్టును సుర్యాంశ్ షెడ్జే (72; 66 బంతుల్లో), విప్రాజ్ నిగమ్ (51; 49 బంతుల్లో) ఆదుకున్నారు.
ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (21; 14 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), ప్రభ్‌సిమ్రన్ (11) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కెప్టెన్ తిలక్ వర్మ (23), వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (37) భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. చివర్లో సుర్యాంశ్, విప్రాజ్ జట్టును ఆదుకున్నారు.
శ్రీలంక బౌలర్లలో విజయ్‌కాంత్ 3, షిరాజ్ 3.. సహన్, ముతులన్, వనుజా సహన్ తలో వికెట్ తీశారు. గమనిక
: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్‌లో ఐపీఎల్ తరహాలో క్రికెట్ సందడి మొదలుకానుంది. యువ ప్రతిభను వెలికితీయడంతోపాటు తెలంగాణ క్రికెట్‌కు కొత్త ఉత్సాహం తీసుకురావాలనే లక్ష్యంతో హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. దాయాది జట్టు పాక్‌పై భారత్ 64 పరుగుల తేడాతో నెగ్గింది. మ్యాచ్ హైలైట్స్ మీ కోసం..