
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ `సింగ్ గీతం`. తన పేరుతోనే ఈ చిత్రాన్ని ఆయన రూపొందించడం విశేషం. తన 95ఏళ్ల వయసులో దీన్ని తెరకెక్కించారు. ఇలా ఈ ఏజ్‌లో దర్శకత్వం వహించిన దర్శకుడిగా ప్రపంచ రికార్డు సృష్టించారు సింగీతం.
దీనికి మరో దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అయితే తెలుగు సినిమాల్లోనే కాదు, ఇండియన్ మూవీస్‌లోనూ ఇదొక ప్రయోగాత్మక మూవీ అని చెప్పొచ్చు. మాటలు, కాదు పాటలతో రన్ కావడమే సినిమా విశేషం. ఇదే ఇందులో కొత్తదనం. సినిమా కుబేరపురం అనే ఒక ఫిక్షన్ విలేజ్‌లో సాగుతుంది.
అదంతా ఏడారి. అక్కడ ఒకే చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కిందనే బంగారు గనులుంటాయి. వాటిని తవ్వేందుకు ఒక మైనింగ్ కంపెనీ ప్రయత్నం చేస్తుంది. అందులో హీరో అప్పుడే జైలు నుంచి రిలీజ్ అవుతాడు. అతని లాయర్ మీ నాన్న నీకు రాసిచ్చిన ఆస్తులు అని ఒక సూట్‌కేస్ ఇస్తాడు.
అందులో 99ఎకరాల ల్యాండ్ పేపర్లు ఉంటాయి. బంగారు గనులు ఉన్న స్థలమే హీరో ల్యాండ్. దీంతో మైనింగ్ కంపెనీ హోనర్తో ఫిఫ్టీ ఫిఫ్టీకి డీల్ కుదుర్చుకుంటారు. అయితే చెట్టుని కొట్టొందని హీరోయిన్ ప్రయత్నం చేస్తుంది. దాన్ని రక్షిస్తూ ఉంటుంది.
కానీ చివరికి చెట్టుని కొట్టేస్తారు. మైనింగ్ స్టార్ట్ చేస్తారు. దీనిపై బాధపడ్డ హీరోయిన్ దేవుడితో తన బాధని వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత ఊర్లో అందరికి మాటలు పోతాయి. పాటలు వస్తుంటాయి. మరి ఆ ఊరు కథేంటి? అలా ఎందుకు జరిగింది? చివరికి ఏం జరిగిందనేది ఈ సినిమా కథ.
మనం మాట్లాడే మాటలు, పాటలుగా రావడమే ఈ మూవీలో ఉన్న కొత్తదనం. అంతేకాదు ఆ ఊరు కూడా కొత్తగా విచిత్రంగా ఉంటుంది. సినిమాగా ఇది ఫస్టాఫ్ చాలా స్లోగా ఉంటుంది. అర్థం కాని విధంగా ఉంటుంది. ఇంటర్వెల్ బాగుంటుంది. సెకండాఫ్ కూడా అదే కొనసాగుతుంది
. కాకపోతే డ్రామా ప్రధానంగా సాగుతుంది. చివర్లో ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే పర్యావరణాన్ని రక్షించాలని, చెట్లని పెంచాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించారు. మేకింగ్ పరంగా, కథనం పరంగా కొత్తగా ఉన్న ఈ మూవీకి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. జనాలు పట్టించుకోవడం లేదు.
సరైన ప్రమోషన్స్ లేకపోవడం, కొత్తతరహా కథ కావడంతో ఆడియెన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో కలెక్షన్లు దారుణంగా ఉంటున్నాయి. ఈ మూవీ మూడు రోజుల్లో ఇండియాలో రూ.3.14కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు కేవలం రూ.73లక్షలు మాత్రమే వచ్చాయి. రెండో రోజు కోటీ రూ.14 లక్షలు, మూడో రోజు కోటీ రూ.26లక్షలు వసూలు చేసింది. రూ.2.7కోట్ల నెట్ రాబట్టింది. అయితే రోజు రోజుకి ఈ మూవీకి కలెక్షన్లు పెరగడం విశేషం. సినిమాకిది పాజిటివ్ నోట్‌గా చెప్పొచ్చు. కాకపోతే సినిమా రేంజ్‌కిది చాలా తక్కువే. సోమవారం నుంచి వచ్చే కలెక్షన్లని బట్టి ఈ మూవీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇక సినిమాలొ ఆయాన్, రాహుల్ రవీంద్రన్, గౌరి, శాలిని, నివేతా పేతురాజ్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.