కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి జాడ తెలియడం లేదు. చిన్నారి కనిపించకుండా పోయి పది రోజులైనా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. చిన్నారి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
అయితే ఇలాంటి సమయంలో జ్ఞానేశ్వరి అదృశ్యం మీద సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న కామెంట్లు ఎంతో బాధ కలిగిస్తున్నాయని చిన్నారి తల్లి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డ క్షేమంగా వస్తుందనే ధైర్యంతో ఉన్నాయని.. దయచేసి తమ ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే నెగటివ్ కామెంట్లు, వీడియోలు పెట్టొద్దంటూ దండం పెట్టి వేడుకున్నారు.
"ఈ వారం రోజుల నుంచి మేము ఎంత బాధపడుతున్నామో మాకు మాత్రమే తెలుసు. తింటున్నామా.. తినలేదా.. పడుకుంటున్నామా.. లేదా అనేది మాకు మాత్రమే తెలుసు. మీరు రావాలనుకుంటే ఓసారి వచ్చి మా పరిస్థితి చూసి వెళ్లండి. అంతే కానీ.. ఎక్కడో ఉండి కామెంట్లు పెట్టొ్దు.
బ్యాడ్ వీడియోలు, బ్యాడ్ న్యూస్ కానీ పెట్టొద్దు. ఉన్న ధైర్యాన్ని కూడా కోల్పోయేలా చేయొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు వీలైతే పాప రావాలని కోరుకోండి. లేదంటే మీ పని మీరు చేసుకోండి. అంతేకానీ మాకున్న ధైర్యాన్ని కూడా దెబ్బతీసేలా నెగెటివ్ కామెంట్లు, వీడియోలు పెట్టొద్దు.
సోషల్ మీడియాలో వచ్చింది చూసి ఏదేదో ఊహించుకుని కామెంట్లు పెట్టడం సరైంది కాదు. దయచేసి తల్లి బాధను అర్థం చేసుకోండి.."అంటూ చిన్నారి జ్ఞానేశ్వరి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. కుక్క చనిపాయే.. పాప దొరక్కపాయే.. జ్ఞానేశ్వరి నువ్వు ఎక్కడమ్మా?ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ..మరోవైపు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఘటనా స్థలిని పరిశీలించారు.
పాప కిడ్నా్ప్ అయ్యి ఉండొచ్చంటూ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్న వేళ.. అలాంటి దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని ఎస్పీ తెలిపారు. క్రూర మృగాలు లాక్కెళ్లి ఉండొచ్చనే అంశంతో పాటుగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
రూ. లక్ష రివార్డు ప్రకటించారు. మరోవైపు ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క డీహైడ్రేషన్ కారణంగా చనిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వివరాలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు.
జ్ఞానేశ్వరి ఆచూకీని తెలిపిన వారికి