
ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం దాదాపు ఖాయం అన్న భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాంకేతిక విప్లవ వేగం పెరగటంతో నిన్నటి నైపుణ్యాలు ఈ రోజు పనికిరాని స్థితికి చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమయ్యే సామర్థ్యాలు ఏమిటన్న దానిపై దేశాలు మళ్లీ ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తీసుకున్న తాజా నిర్ణయాలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ప్రపంచ ఉద్యోగ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ..
చైనా ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా... కాలం చెల్లినట్లు భావిస్తున్న వేలాది డిగ్రీ కోర్సులను విశ్వవిద్యాలయాలు తొలగిస్తున్నాయి. చైనా ఉన్నత విద్యా సంస్థలు తమ విద్యా కోర్సుల్లో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్నాయి.
దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత దగ్గరచేసే ప్రయత్నంలో భాగంగా వేల సంఖ్యలో కాలం చెల్లినట్లు భావిస్తున్న డిగ్రీలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సాంకేతికత ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. 10,200 కొత్త కోర్సులు పరిశ్రమల్లో ప్రపంచ నాయకత్వం సాధించాలనే లక్ష్యాన్ని చైనా పెట్టుకుంది.
అలాగే, చైనాలో లక్షలాది యువతకు ఉపాధి దొరకడం లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నంలో చైనా ఈ చర్యలు చేపడుతోంది. 2021 నుంచి 2025 మధ్య చైనా ఉన్నత విద్యా సంస్థలు 12,200 అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను రద్దు చేశాయి/నిలిపివేశాయి.
అదే సమయంలో 10,200 కొత్త కోర్సులను ప్రారంభించాయి. దీంతో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ కోర్సుల్లో 30% కంటే ఎక్కువ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విభాగాల్లో కోర్సులు ఔట్ ఈ తొలగింపులు ప్రధానంగా కళలు, మానవీయ శాస్త్రాలు, విదేశీ భాషలు, నిర్వహణ విద్య విభాగాల్లో జరిగాయి.
Jun 15 2026 4:03 PM | Updated on Jun 15 2026 4:03 PM
ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం దాదాపు ఖాయం అన్న భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాంకేతిక విప్లవ వేగం పెరగటంతో నిన్నటి నైపుణ్యాలు ఈ రోజు పనికిరాని స్థితికి చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమయ్యే సామర్థ్యాలు ఏమిటన్న దానిపై దేశాలు మళ్లీ ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తీసుకున్న తాజా నిర్ణయాలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ప్రపంచ ఉద్యోగ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ.. చైనా ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా... కాలం చెల్లినట్లు భావిస్తున్న వేలాది డిగ్రీ కోర్సులను విశ్వవిద్యాలయాలు తొలగిస్తున్నాయి. చైనా ఉన్నత విద్యా సంస్థలు తమ విద్యా కోర్సుల్లో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్నాయి. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత దగ్గరచేసే ప్రయత్నంలో భాగంగా వేల సంఖ్యలో కాలం చెల్లినట్లు భావిస్తున్న డిగ్రీలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సాంకేతికత ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.
10,200 కొత్త కోర్సులు పరిశ్రమల్లో ప్రపంచ నాయకత్వం సాధించాలనే లక్ష్యాన్ని చైనా పెట్టుకుంది. అలాగే, చైనాలో లక్షలాది యువతకు ఉపాధి దొరకడం లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నంలో చైనా ఈ చర్యలు చేపడుతోంది. 2021 నుంచి 2025 మధ్య చైనా ఉన్నత విద్యా సంస్థలు 12,200 అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను రద్దు చేశాయి/నిలిపివేశాయి. అదే సమయంలో 10,200 కొత్త కోర్సులను ప్రారంభించాయి. దీంతో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ కోర్సుల్లో 30% కంటే ఎక్కువ మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ విభాగాల్లో కోర్సులు ఔట్ ఈ తొలగింపులు ప్రధానంగా కళలు, మానవీయ శాస్త్రాలు, విదేశీ భాషలు, నిర్వహణ విద్య విభాగాల్లో జరిగాయి. చైనాలో యువత విషయంలో నిరుద్యోగం 16% కి పైగా ఉండటం, ఉద్యోగ రంగం కృత్రిమ మేధ ప్రభావంతో వేగంగా మారిపోవటం వల్ల ఈ విభాగాలను కాలం చెల్లినవిగా భావిస్తున్నారు.
ఇక కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులు చైనా ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలకు దగ్గరగా ఉన్నాయి. ఉదాహరణకు, 9 విశ్వవిద్యాలయాలు "ఎంబాడీడ్ ఇంటెలిజెన్స్"ని ప్రారంభించాయి. ఎంబాడీడ్ ఇంటెలిజెన్స్ అంటే భౌతిక యంత్రాలు లేదా రోబోట్లు పరిసరాలను గుర్తించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే కృత్రిమ మేధ విధానం.
పనికిరాని కోర్సులు ఎందుకు? తదుపరి తరం కృత్రిమ మేధను వాస్తవ ఆర్థిక వ్యవస్థలో వేగంగా కలపాలనే జాతీయ లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా మారిపోతుండటంతో విశ్వవిద్యాలయాలపై మార్పులు చేపట్టాలనే ఒత్తిడి పెరిగింది. పట్టభద్రుల సంఖ్య రికార్డు స్థాయికి చేరినా, చాలామందికి వారి డిగ్రీలు ఉద్యోగాలు సంపాదించటంలో పెద్దగా ఉపయోగపడటం లేదు.
ఉదాహరణకు, షాంఘై సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ఈ ఏడాది తన ఉత్పత్తి రూపకల్పన కోర్సులో ప్రవేశాలను నిలిపివేసింది. ఆ కోర్సు వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటమే ఈ నిర్ణయానికి ఒక కారణం. మోడలింగ్, రెండరింగ్ వంటి అనేక ప్రధాన పనులను ఇప్పుడు కృత్రిమ మేధే నిర్వహిస్తోంది.
మాధ్యమ విద్యపై దృష్టి సారించిన బీజింగ్‌లోని ప్రతిష్ఠాత్మక కమ్యూనికేషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనా కూడా పలు కోర్సులను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో సినిమాటోగ్రఫీ కోర్సును ఫిల్మ్ అండ్ టెలివిజన్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ కోర్సుతో విలీనం చేసింది.
పూర్వ విద్యార్థులు ఏమంటున్నారు? ఈ మార్పు సాంకేతిక, మార్కెట్ పరిణామాలకు సహజ ప్రతిస్పందన అని విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. 2012లో సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేసిన వీడియోగ్రాఫర్ సాంగ్ సాంగ్ మాట్లాడుతూ.. తాను చదివిన కాలంలో ఫిల్మ్ నుంచి డిజిటల్ సాంకేతికత వైపు మార్పు జరిగిందని చెప్పాడు.
“ప్రత్యక్ష ప్రసారాలు, చిన్న వీడియోలు పెరగటంతో కెమెరామెన్ నైపుణ్య అవసరాలు సంప్రదాయ టెలివిజన్ వార్తల చిత్రీకరణతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి” అని సాంగ్ అన్నాడు. విద్యలో మార్పులు తప్పనిసరి అని తెలిపాడు.
అయితే ఒక కోర్సు స్థానంలో మరో కోర్సును ప్రవేశపెట్టటం తాత్కాలిక పరిష్కారమే అవుతుందని, వేగంగా మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా ఉన్నత విద్యలో మరిన్ని మార్పులు అవసరమని జాతీయ విద్యా శాస్త్రాల సంస్థ సీనియర్ పరిశోధకుడు చు జావోహుయ్ హెచ్చరించారు.
విశ్వవిద్యాలయాలు తొలగించిన అనేక కోర్సులు కొన్నేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయని చు పేర్కొన్నారు. అందువల్ల అభివృద్ధి చెందటానికి తగిన సమయం కూడా వాటికి దొరకలేదని తెలిపారు.
ఒక ప్రధానాంశం స్థానంలో మరొకటి మార్చటం కన్నా, విద్యార్థులకు తమ కోర్సులను తామే ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఇచ్చే సౌకర్యవంతమైన విధానాన్ని విశ్వవిద్యాలయాలు అవలంబించాలని చు సూచించారు.
“దీంతో విద్యార్థులు తమ ఆసక్తులు, ప్రత్యేక సామర్థ్యాలు, భిన్న వృత్తి మార్గాల అవసరాలకు అనుగుణంగా కోర్సులను ఎంచుకుని, తమకంటూ ప్రత్యేక మేధో స్వరూపాన్ని నిర్మించుకుంటారు” అని చు అన్నారు. ఉద్యోగ విపణి మరింత అనిశ్చితంగా మారుతున్న వేళ చైనాలో చాలామంది అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీని అంతిమ గమ్యంగా కాకుండా తొలి మెట్టుగా చూడటం ప్రారంభించారు.
హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు)
‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)
ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)
‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే.. మాకవరపాలెం పోలీసుల ఓవర్ యాక్షన్
సుందర్ పిచాయకు బిగ్ షాక్, యూనివర్సిటీలో అవమానం
ఆటలోనే కాదు పౌరుషంలో కూడా తగ్గేదే లేదు...
వేరే దేశానికి జంప్.! లాయర్ చెప్పిన షాకింగ్ నిజాలు
చైనాలో యువత విషయంలో నిరుద్యోగం 16% కి పైగా ఉండటం, ఉద్యోగ రంగం కృత్రిమ మేధ ప్రభావంతో వేగంగా మారిపోవటం వల్ల ఈ