
హైదరాబాద్: నగరంలో ప్రభుత్వ భూములు కాజేసే కుట్ర కేసులో అరెస్టయిన వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి మూడు రోజుల పోలీసు కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది. గండిపేట సమీపంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించారు.
వీటి ఆధారంగా ఈ కేసులో అరెస్టయిన మరికొందరు నిందితులతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. బొల్లా బ్రహ్మనాయుడి పాత్ర ఉన్నట్లు పక్కా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోరగా..
కోర్టు అనుమతించింది. రేపటి నుంచి మూడు రోజులపాటు బొల్లా బ్రహ్మనాయుడిని కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ 10 రోజులైనా ఇంకా లభించలేదు
.