
ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి దంపతులు సోమవారం హైదరాబాద్లోని తమ నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్/అమరావతి, జూన్ 15: ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి దంపతులు ఈరోజు(సోమవారం) హైదరాబాద్లోని తమ నివాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
విశిష్టమైన సోమవారం సందర్భంగా మహాశివుడికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో లోకేశ్ దంపతులు నిర్వహించారు. ఆయురారోగ్యాలు, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రుత్వికుల వేదమంత్రాల నడుమ లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కాంక్షిస్తూ లోకేశ్, బ్రాహ్మణి శివారాధన చేశారు. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వేదోక్తంగా నిర్వహించారు. శివానుగ్రహం కోసం లోకేశ్ కుటుంబం ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర సుభిక్షం కోసం మహాశివుడిని లోకేశ్ దంపతులు ప్రార్థించారు.
మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం ప్రత్యేక హారతులు, ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించారు. యూఎన్ హాబిటాట్తో ఏపీ భాగస్వామ్యం.. సీఎం చంద్రబాబు కీలక భేటీ విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు: హోం మంత్రి అనిత