
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే కాలయముడై భార్యను 24 గంటల పాటు నరకయాతనకు గురిచేశాడు. మెడకు ఇనుప గొలుసు బిగించి, స్తంభానికి కట్టి, వేడి రాడ్‌తో వాతలు పెట్టి తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు.
అయితే, ఆ నరకం నుంచి అసామాన్య ధైర్యంతో తప్పించుకున్న ఆ మహిళ, మెడలో గొలుసుతోనే 6 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తనను బంధించిన గొలుసునే భర్త అకృత్యాలకు సాక్ష్యంగా మార్చింది.బాధితురాలు మంగీబాయి తన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఆమె భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.
రాత్రి భోజనం తర్వాత ఆమెను దూషించడం ప్రారంభించాడు. ఆమె ఎదురు తిరగడంతో కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దెబ్బలు తాళలేక, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మంగీబాయి రాత్రికి రాత్రే ఇంటి నుంచి బయటకు వెళ్లింది.కిల్చిపూర్ పోలీస్ స్టేషన్‌కు నడిచి వెళ్తుండగా, మార్గమధ్యంలో ఓ ఆలయం వద్ద భర్త ఆమెను అడ్డగించి, మళ్లీ దాడి చేసి బలవంతంగా గ్రామానికి తీసుకెళ్లాడు.
ఇంటికి తీసుకొచ్చాక అతని రాక్షసత్వం మరింత పెరిగింది. "ఇప్పుడెలా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నాపై ఫిర్యాదు చేస్తావో చూస్తా" అంటూ ఆమె మెడకు ఇనుప గొలుసు చుట్టి, దానికి తాళం వేసి ఇంటిలోని ఓ స్తంభానికి కట్టేశాడు.అంతటితో ఆగకుండా గ్యాస్ స్టవ్‌పై ఇనుప రాడ్‌ను వేడి చేసి ఆమె నడుము, తుంటి, కుడి తొడపై వాతలు పెట్టాడు.
ఆమె నొప్పితో ఎంత అరిచినా ఎవరూ సహాయానికి రాలేదు. దాదాపు 24