
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Japan Football Fans Clean Stadium: ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా జపాన్ అభిమానులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో ఆదివారం (జూన్ 14) నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జపాన్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను 2-2 పాయింట్లతో డ్రా చేసింది.
అయితే ఆటతో ఫుట్‌బాల్ ఆటగాళ్లు తమ అభిమానుల హృదయాలను గెలుచుకోగా.. జపాన్ అభిమానులు కూడా తమ వంతు బాధ్యతగా ఆతిథ్య దేశం పట్ల గౌరవ సూచకంగా మ్యాచ్ తర్వాత స్టేడియంను శుభ్రం చేశారు. తమ జట్టు పాల్గొనే క్రీడా ఈవెంట్లలో మ్యాచ్‌ల తర్వాత తాము కూర్చున్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం జపాన్ అభిమానులకు అలవాటు.
ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ 2026 వారి సంస్కృతికి మరో ఉదాహరణగా నిలిచింది. ఆదివారం మ్యాచ్ తర్వాత అభిమానులు స్టేడియంను శుభ్రం చేస్తున్న వీడియోను FIFA నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఎంతోమంది హృదయాలను గెలుచుకుంటోంది.
జపాన్ ఫ్యాన్స్ ఎందుకు శుభ్రం చేస్తున్నారు? ఫీఫా అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన వీడియోలో.. అభిమానులు చెత్తను నీలం రంగు సంచులలో వేస్తూ స్టేడియంలో తాము కూర్చున్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం కనిపిస్తుంది. అప్పుడు ఒక అభిమాని ఈ పనికి గల కారణాన్ని వెల్లడించారు.
"అది మా సంస్కృతి. ఇది అన్నింటి పట్ల గౌరవం - ఆటగాళ్ల పట్ల, తోటి అభిమానుల పట్ల, స్టేడియం పట్ల గౌరవం. ఇక్కడ ఉండటం మాకు గౌరవప్రదమైన విషయం, కాబట్టి
మేము చెత్తను అలాగే వదిలి వెళ్లకూడదనుకుంటున్నాము. అందుకే మేము ఇలా చేస్తున్నాము" అని ఆ వీడియోలో స్పష్టం చేశారు.
ఈ ఆలోచన "Tatsu tori ato wo nigosazu" అనే జపనీస్ సామెత యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి ఆంగ్లంలో "A bird leaves nothing behind" (పక్షి ఎటువంటి ఆనవాళ్లనూ వదిలిపెట్టదు) అని అర్థం. ఈ సామెత యొక్క అసలు అర్థం "ఏదైనా ప్రదేశాన్ని మీరు ఎలా చూశారో, తిరిగి వెళ్లేటప్పుడు కూడా అలాగే ఉంచడం" అని అర్థం వస్తుంది.
చిన్నతనంలోనే పాఠశాలల్లో తరగతి గదులు, కారిడార్లను శుభ్రం చేయడం ద్వారా ఈ విధానం ప్రజలలో అలవాటుగా మారుతుంది. ఒసాకా యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ స్కాట్ నార్త్ 2018లో BBCకి ఇలా వివరించారు. "చిన్నప్పటి నుండి నిరంతరం గుర్తుచేయడం వల్ల, ఈ ప్రవర్తనలు చాలా మంది ప్రజలకు అలవాటుగా మారిపోతాయి" అని ఆయన అన్నారు.
జపాన్ తర్వాతి మ్యాచ్‌లు.. జపాన్ తన రెండవ గ్రూప్ F మ్యాచ్‌ను జూన్ 20న మెక్సికోలోని ఎస్టాడియో మాంటెర్రేలో ట్యునీషియాతో ఆడనుంది. ఆ తర్వాత జూన్ 25న డల్లాస్ స్టేడియంలో స్వీడన్‌తో గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో తలపడుతుంది. నెదర్లాండ్స్‌తో 2-2తో మ్యాచ్ డ్రా అయిన తర్వాత, జపాన్ ప్రస్తుతం తన గ్రూప్‌లో స్వీడన్ తర్వాత రెండవ స్థానంలో ఉంది.
భారతదేశంలో జపాన్ ఆడనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్షప్రసారం చూడొచ్చు. జీ మీడియాకు సంబంధించిన Zee5 యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఫుట్ బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.