
ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ తరహా చిత్రాలకే జనాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు మీకోసం ఒక హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ తీసుకోచ్చాం.
ఈ సిరీస్ ఒంటరిగా చూడాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. ఇంతకీ ఈ సిరీస్ ఏంటో తెలుసా.. ?దాని పేరు అసుర్. ఇది హిందూ పురాణాలను, ఆధునిక విజ్ఞానాన్ని మేళవించి మానవ మనస్తత్వాన్ని అన్వేషించే ఒక సిరీస్. రెండు సీజన్లు, మొత్తం 16 ఎపిసోడ్లతో ఉన్న ఈ సిరీస్ మిమ్మల్ని తెరపై నుండి కళ్ళు తిప్పుకోనివ్వదు.
ఇందులో అతిపెద్ద హైలైట్ 17 ఏళ్ల బాలుడు పోషించిన 'అసుర' అవతారం. నటుడు విశేష్ బన్సల్ 'శుభ్ జోషి' అనే సైకో కిల్లర్ చిన్ననాటి పాత్రను ఎంత ఉత్కంఠభరితంగా పోషించాడంటే, తన నటనతో అర్షద్ వార్సి, బరున్ సోబ్తి వంటి సీనియర్ నటులకు సైతం గట్టి పోటీ ఇచ్చాడు.
కలియుగాన్ని స్థాపించి, తానే 'కలి' కావాలనేందుకు ఆ బాలుడు ఎంతటి క్రూరమైన చర్యలకు పాల్పడతాడో చూసి ప్రేక్షకులు నివ్వెరపోయారు. ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
ఎవరంటే.. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ మార్చి 2020లో విడుదలైంది. ఓని సేన్ దర్శకత్వం వహించిన ఈ షోలో అర్షద్ వార్సి, బరున్ సోబ్తి, అనుప్రియ గోయెంకా, రిద్ధి డోగ్రా , మహారాష్ట్ర అభిమాన నటుడు అమే వాఘ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ తనను తాను 'అసురుడు'గా భావించుకునే అత్యంత తెలివైన ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది.
అతనికి ప్రకృతి ప్రసాదించిన వరం ప్రకారం, అతను ఏ విషయాన్నైనా క్షణాల్లో నేర్చుకోగలడు. సిబిఐ అధికారి ధనంజయ్ రాజ్‌పుత్ (అర్షద్ వార్సి) , ఫోరెన్సిక్ నిపుణుడు నిఖిల్ నాయర్ (బరున్ సోబ్తి) ఈ రాక్షసుడితో
పోరాడటానికి తమ సర్వశక్తులను ఒడ్డారు.
ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..
రెండవ సీజన్లో, ఈ రాక్షసుడు కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో ప్రపంచంపై ఒక పెద్ద దాడికి కుట్ర పన్నుతాడు, ఈ ఇద్దరు అధికారులు అతన్ని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు.'అసుర్' భారతీయ ఓటీటీ చరిత్రలో అత్యంత విజయవంతమైన సిరీస్‌గా దూసుకుపోతుంది. ఈ సిరీస్ IMDbలో 10కి 8.5 రేటింగ్‌ను పొందింది. జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఇప్పటివరకు 26 అవార్డులను గెలుచుకుంది. ఈ సిరీస్‌లో తన అద్భుతమైన నటనకు గాను నటుడు అర్షద్ వార్సీ 2021లో ప్రతిష్టాత్మక 'దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫౌండేషన్ అవార్డు' అందుకున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏం పాట రా బాబు.. అప్పట్లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : దాసరి, చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న నటుడిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు జబర్దస్త్ షోలో ఫేమస్ కమెడియన్..