
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) విషయంలో కాంగ్రెస్ ఆరోపణలు సరికావని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachander Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఈసీ (CEC)లకు గతంలో కాంగ్రెస్ పార్టీ పద్మ పురస్కారాలు (Padma Awards), రాజ్యసభ (Rajya Sabha) పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ గతంలో 12 సార్లు జరిగిందన్నారు. ఎస్ఐఆర్ లో ప్రతిపార్టీ బీఎలఏ-2ను నియమించుకుంటుంది. అభ్యంతరాలుంటే ఆయా పార్టీల బీఎలఏ2లు వెంటనే చెప్తారు. ఎసఐఆర్లో దొంగ నోట్లు, డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగిస్తారు. ఈ ప్రకియతో బీజేపీకి, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు
.