
ఫోన్లోని కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్‌ను మార్చడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను సులభంగా పెంచుకోవచ్చు. స్క్రీన్ సెట్టింగ్స్ నుంచి యాప్‌ల వినియోగం వరకు చిన్న మార్పులు చేస్తే ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు పనిచేస్తుంది. ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ఎక్కువ మంది ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో బ్యాటరీ త్వరగా అయిపోవడం ఒకటి.
రోజంతా ఫోన్ ఉపయోగించాల్సి రావడంతో తరచుగా ఛార్జింగ్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఫోన్లోని కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్‌ను మార్చడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను సులభంగా పెంచుకోవచ్చు. స్క్రీన్ సెట్టింగ్స్ నుంచి యాప్‌ల వినియోగం వరకు చిన్న మార్పులు చేస్తే ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు పనిచేస్తుంది.
ఫోన్ బ్యాటరీలో ఎక్కువ భాగం స్క్రీన్‌కే ఖర్చవుతుంది. అందుకే బ్రైట్నెస్ తగ్గించాలి. సెట్టింగ్స్‌లో డిస్ప్లే ఆప్షన్లో డార్క్ మోడ్ ఉపయోగించాలి. డార్క్ మోడ్ లేదా నైట్ మోడ్ ఆన్ చేస్తే బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. ఇది కళ్లకు కూడా తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.
హై రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ స్మూత్‌గా కనిపిస్తుంది కానీ బ్యాటరీ త్వరగా ఖర్చవుతుంది. అందుకే సెట్టింగ్స్‌లో డిస్ప్లే ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ రిఫ్రెష్ రేట్‌ను తక్కువగా సెట్ చేస్తే బ్యాటరీ లైఫ్‌ను సేవ్ చేసుకోవచ్చు. కొన్ని యాప్‌లు ఉపయోగించకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో బ్యాటరీ వాడుతుంటాయి.
సెట్టింగ్స్‌లో ఏ యాప్ ఎంత బ్యాటరీ వాడుతోందో చెక్ చేయాలి. ప్రయాణంలో లేదా నెట్ అవసరం లేని సమయంలో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాలి. దీంతో ఫోన్ సిగ్నల్ కోసం ప్రయత్నించదు కాబట్టి బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది. ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ మార్చడం ద్వారా మీ ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను సులభంగా పెంచుకోవచ్చు.
తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది, ఫోన్ పనితీరు కూడా మెరుగవుతుంది. UPSC నోటిఫికేషన్.. 400కు పైగా ఉద్యోగ ఖాళీలు కష్టకాలంలోనూ విజయం దక్కాలంటే ఇలా ఉండాలి.!