
దర్శకుడు ఆర్జే బాలాజీకి (RJ Balaji) హీరో సూర్య (Suriya) కారును బహుమతిగా ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కరుప్పు' తాజాగా విడుదలై ఘన విజయం సాధించింది. దర్శకుడు ఆర్జే బాలాజీకి (RJ Balaji) హీరో సూర్య (Suriya) కారును బహుమతిగా ఇచ్చారు.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కరుప్పు' తాజాగా విడుదలై ఘన విజయం సాధించింది. పలు అవాంతరాల మధ్య మే 15న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.350 కోట్ల వరకు రాబట్టింది. సూర్య సినీ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
పైగా ఇది దశాబ్దకాలం తర్వాత సూర్యకు వచ్చిన విజయం. ఈ నేపథ్యంలో తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇచ్చిన దర్శకుడు ఆర్జే బాలాజీకి హీరో సూర్య కారును బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని ఆర్జే బాలాజీ వెల్లడిస్తూ, 'ఈ సినిమా ప్రారంభించిన తొలి రోజు నుంచే మీరు నాపై పెట్టుకున్న నమ్మకం అనే కల నిజ జీవితంలో నిజమైంది.
మీరిచ్చిన మద్దతు నా జీవితంలో సరికొత్త ప్రయాణానికి నాంది పలికింది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని మీకు నేను ఇచ్చిన హామీ ఇపుడు నిజమైంది. ఇవన్నీ వాస్తవరూపంలో కార్యరూపం దాల్చడానికి ఒకే ఒక వ్యక్తి కారణం.. అదే మీరే సూర్య సార్' అని పేర్కొన్నారు.
మహిళా సాధికారత నేపథ్యంలో ‘అభయ’.. టైటిల్ పోస్టర్ ఇదే! Vijay Deverakonda: రౌడీ స్టార్.. లైనప్ అదిరింది
..