
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ నటి... ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడంలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా స్టార్ డమ్ చూసిన జయసుధ..
వయసు పెరగడంతో సినిమాలు కాస్త తగ్గించింది. అయినా సరే తెలుగు ఆడియ్స్ లో ఆమె ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దాదాపు మూడు తరాల హీరోలతో కలిసి నటించింది. చాలా ఇంటర్వ్యూలలో జయసుధ తన నట జీవితం, తన తోటి నటీనటుల గురించి ఎన్నోవిషయాలను షేర్ చేసుకున్నారు.
అంతే కాదు తనకు వ్యక్తిగతంగా ఇండస్ట్రీలో ఎవరు దగ్గరగా ఉంటారో కూడా ఆమె వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల గురించి గురించి ఆసక్తికర విషయాలు ఆమె వెల్లడించారు.
జయసుధ మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. చిరంజీవితో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. మెగా ఫ్యామిలీ తనతో ఎంతో ప్రేగా ఉంటారని ఆమె అన్నారు. ముఖ్యంగా చిరంజీవి గురించి జయసుధ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన సినీ ప్రయాణం ఎంతో కఠినమైనదని ఆమె అన్నారు.
అప్పటికే ఇండస్ట్రీలో నలుగురు పెద్ద హీరోలు ఉన్నారు.. చిరంజీవి వచ్చిన తరువాత కూడా .. పెద్ద పెద్ద సినిమా కుటుంబాల నుంచి వారసత్వంగా ముగ్గురు హీరోలు వచ్చారు. ఆ టైమ్ లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం అంత సులభం కాదు.
కానీ చిరంజీవి క్రమశిక్షణ, ఏదైనా సాధించాలనే సంకల్పం, కృషి ఆయన విజయానికి ప్రధాన కారణాలని జయసుధ వివరించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, '' రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవిలాగే ఎంతో వినయంగా, క్రమశిక్షణతో ఉంటారు .
షూటింగ్ సెట్‌కు వచ్చినప్పుడు పెద్దలను ఎలా గౌరవించాలి, వారితో ఎలా
మాట్లాడాలనే సంస్కారం ఆయనలో కనిపిస్తుంది. మెగాస్టార్ కుటుంబం మొత్తం ఎంతో వినయంగా ఉంటుంది, వారు ఎప్పుడూ తమను తాము మెగాస్టార్ కుటుంబ సభ్యులమని గొప్పగా చెప్పుకోరు. అయితే ఇండస్ట్రీలో తనను “ఆంటీ” అని పిలిచే వ్యక్తి ఒక్క రామ్ చరణ్ మాత్రమేనని జయసుధ వెల్లడించారు. మిగిలిన వారందరూ తనను “జయసుధ గారు” అనే పిలుస్తారని అన్నారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. '' నేను పవన్ తో బాలు సినిమాలో కలిసి నటించాను. పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడరు. పలకరిస్తేనే మాట్లాడతారు'' అని ఆమె తెలిపారు. .
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కూడా జయసుధ చాలా విషయాలు చెప్పారు. '' మహేష్ బాబును నేను చిన్పప్పటి నుంచి చూస్తున్నాను.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే టైమ్ లో షూటింగ్‌లకు రావడం, సినిమాల్లో నటించడం వంటి విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. మహేష్ బాబు ఆయన తండ్రి కృష్ణలాగే ప్రశాంతంగా ఉంటారు, చాలా తక్కువ మాట్లాడతారు, నేను మహేష్ బాబు తల్లి పాత్రలో ‘మహర్షి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాల్లో నటించాను. మహేష్ నన్ను ఎప్పుడూ “జయసుధ గారు” అని పిలుస్తారు.. నేను మాత్రం “మహేష్” అని పిలుస్తాను''. అని ఆమె చెప్పారు.