
Coffee with Karnataka : వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి అందాలు రెట్టింపు అవుతాయి. ఎండాకాలంలో బీడుబారిన భూములు పచ్చని చీరకట్టినట్లు మారిపోతాయి... చెట్లు కొత్త చిగుర్లు తొడుక్కుంటాయి. వరదనీటితో జలజలాపారే నదులు... నిండుకుండలా మారే చెరువులు, వాగులు...
కొండలపైనుండి జాలువారే జలపాతాలు... ఆ అందాలు కనువిందు చేస్తాయి. ఇలా వర్షాకాలంలో సరికొత్త అందాలతో పర్యాటకులకు ఆకట్టుకునే ప్రాంతమే కర్ణాటకలోని కూర్గ్. మైసూరు సమీపంలోని కూర్గ్ అందమైన హిల్ స్టేషన్. కొండ అంచుల్లో అందమైన కాఫీ తోటలతో కూడిన ఈ ప్రాంతాన్ని ''ఇండియన్ స్కాట్లాండ్'' అంటారు.
కావేరీ నది ఒడ్డున అందమైన ప్రాంతాలు, జలపాతాలు ఆకట్టుకుంటాయి. ఈ ప్రాంతాలను కవర్ చేసేలా IRCTC టూర్ ప్యాకేజీ ప్రకటించింది. IRCTC (ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్రతి బుధవారం హైదాబాద్ నుండి కర్ణాటకలోని ప్రాంతాలను చుట్టివచ్చేలా టూర్ ప్లాన్ ప్రకటించింది.
కాఫీ విత్ కర్ణాటక పేరిట ప్రకటించిన ఈ వీకెండ్ టూర్ ప్యాకేజీలో కూర్గ్, మైసూరు అందాలను చుట్టిరావచ్చు. కేవలం రూ.11260 కే 5 రాత్రులు/6 రోజుల టూర్ ఉంటుంది. ట్రైన్ (స్లీపర్/3AC), రోడ్డు ప్రయాణం ఉంటుంది. తెలుగు ప్రజలు వర్షాకాలంలో ఈ టూర్ కి వెళితే ఏడాదికి సరిపడా అనుభూతులు పొందవచ్చు.
ఐఆర్సిటిసి కాఫీ విత్ కర్ణాటక టూర్ కోసం రెండు రకాల ప్యాకేజీలు సిద్దంచేసింది. ట్విన్ షేరింగ్ (రెండు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.19750 ట్రిపుల్ షేరింగ్ (మూడు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.15400 అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) విత్ బెడ్ తో : రూ.10950 అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) బెడ్ లేకుండా : రూ.9700 ట్విన్ షేరింగ్ (రెండు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.17720 ట్రిపుల్ షేరింగ్ (మూడు టికెట్లు బుక్ చేస్తే
ఒక్కో టికెట్ ధర) : రూ.13370
అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) విత్ బెడ్ తో : రూ.8920
అదనంగా ఓ చిన్నారి (5-11 ఏళ్ల వయసు) బెడ్ లేకుండా : రూ.7670
ట్విన్ షేరింగ్ (రెండు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.16160
ట్రిపుల్ షేరింగ్ (మూడు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.13770
ట్విన్ షేరింగ్ (రెండు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.14130
ట్రిపుల్ షేరింగ్ (మూడు టికెట్లు బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర) : రూ.11750
కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రంతా కాచిగూడ-మైసూరు ఎక్స్ ప్రెస్ లో జర్నీ ఉంటుంది.
ఉదయమే మైసూరుకు చేరుకుంటారు. అక్కడినుండి 115 కిలోమీటర్ల దూరంలోని కూర్గ్ కు మధ్యాహ్నం వరకు చేరుకుంటారు. హోటల్లో ప్రెష్ అప్ అయ్యాక అబ్బేయ్ ఫాల్స్, ఓంకారేశ్వర ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి కూర్గ్ లోనే బస చేయాలి
కూర్గ్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ అనంతరం తలకావేరి, భాగమండల సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం రాజాస్ సీట్ విజిట్ ఉంటుంది. రాత్రి కూర్గ్ లో బస.
హోటల్లో టిఫిన్ చేసి మైసూరుకు బయలుదేరాలి. మార్గమధ్యలో కావేరీ నిసర్గధామ, టిబెటన్ మానస్టెరీ, బృందావన గార్డెన్ సందర్శన ఉంటుంది. రాత్రి మైసూరు హోటల్లో బస ఉంటుంది.
మైసూరు హోటల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం చాముండి హిల్స్ సందర్శన ఉంటుంది. ప్రఖ్యాత మైసూరు ప్యాలస్ అందాలను ఆస్వాదించాలి. మధ్యాహ్నం మైసూరు రైల్వే స్టేషన్ నుండి హైదరాబాద్ కు తిరుగుపయనం ఉంటుంది.
కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకోవడంతో ఈ ట్రిప్ ముగుస్తుంది.
ఈ కాఫీ విత్ కర్ణాటక ప్యాకేజీ కింద ఐఆర్సిసిటిసి రైలు టికెట్లు, వెహికిల్ ఖర్చులు, బ్రేక్ ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సందర్శన టికెట్లు యాత్రికులే భరించాలి. లంచ్, డిన్నర్ తో పాటు స్నాక్స్ వంటివి కూడా యాత్రికులే సమకూర్చుకోవాలి. రైల్లో భోజనం కూడా ప్రయాణికులదే. టూర్ గైడ్ తో పాటు ఇతర ఏ సర్వీసులైనా యాత్రికులు సొంతంగా భరించుకోవాలి.
ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీల వివరాల కోసం కాంటాక్ట్ చేయండి.
9-1-129/1/302,3rd ప్లోర్, ఆక్స్ ఫార్డ్ ప్లాజా
మొబైల్ నంబర్ : 8287932229/ 8287932228/ 9701360701