
Abhaya Movie First Look Poster: యోగిత భోసాలె ప్రధాన పాత్రలో యూసఫ్ ముజామ్మిల్ సుర్తి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న మూవీ అభయ. డా.విమల్ రాజ్ మాథుర్, శ్రీ రూపేష్ డి.గోహిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, మరాఠీ, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించేందుకు ఈ మూవీ సిద్ధమవుతోంది.
తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ ఆడియన్స్‌కు పరిచయం చేశారు. పోస్టర్‌తోనే హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. మహిళా సాధికారితపై పవర్ఫుల్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మోహన్ జోషి, గణేష్ యాదవ్, కమలేష్ సావంత్, అనికేత్ కేల్కర్, రోహిత్ కోకటి, ఉమేష్ బోల్కె తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
నిర్మాత డా.విమల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ.. అభయ.. కేవలం సినిమా మాత్రమే కాదని.. సమాజానికి బలమైన సందేశం ఇస్తుందన్నారు. ఈ సినిమా ద్వారా ఎందరికో ప్రేరణగా నిలుస్తోన్న మహిళల శక్తి.. పట్టుదలను సెబ్రేట్ చేసుకోబోతున్నామని చెప్పారు.
నాలుగు భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. పోస్టర్‌ను రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. మరో నిర్మాత శ్రీ రూపేష్ డి.గోహిల్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు అభయ మూవీ అర్థవంతమైన సందేశాన్ని అందజేస్తుందన్నారు.
బలమైన కథన.. అద్భుతమైన నటీనటులతో సినిమా రూపొందిందని తెలిపారు. సినిమాటిక్ అనుభవాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. సినిమాను తప్పకుండా ఆదరించి.. మంచి విజయాన్ని అందించాలని కోరారు.
టెక్నికల్ టీమ్: నిర్మాణ సంస్థ: గ్రాడియెంటే ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్, RDG ప్రొడక్షన్ ప్రై.లి. ప్రొడ్యూసర్స్: డాక్టర్ విమల్ రాజ్ మాథుర్, రూపేష్ డి.గోహిల్ రైటింగ్, డైరెక్షన్: యూసఫ్ ముజామ్మిల్ సుర్తి