
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. FIFA World Cup Germany Vs Curacao: ఫిఫా ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ జర్మనీ ఊహించినట్లుగానే భారీ విజయంతో టోర్నీని ఘనంగా ప్రారంభించింది. అమెరికాలోని హ్యూస్టన్ స్టేడియం వేదికగా జూన్ 14న జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో జర్మనీ 7-1 గోల్స్ తేడాతో కురాకో జట్టును పూర్తిగా చిత్తు చేసింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందే ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జర్మనీ.. మైదానంలో వన్-సైడ్ గేమ్‌తో ప్రత్యర్థిని ముంచెత్తింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీ గోల్స్ సునామీ.. మ్యాచ్ ప్రారంభమైన నిమిషం నుంచే జర్మనీ ఆటగాళ్లు కురాకో డిఫెన్స్‌పై దాడులు ప్రారంభించారు.
మ్యాచ్ మొదలైన 6వ నిమిషంలోనే ఫెలిక్స్ న్మెచా అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో జర్మనీకి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే, మ్యాచ్ 21వ నిమిషంలో కురాకో ప్లేయర్ లివానో కోమెనెన్సియా అనూహ్యంగా ఒక గోల్ సాధించి స్కోరును 1-1తో సమం చేసి జర్మనీకి షాకిచ్చాడు.
కురాకో గోల్ కొట్టడంతో అలెర్ట్ అయిన జర్మనీ మరింత దూకుడు పెంచింది. 38వ నిమిషంలో జర్మన్ ఆటగాడు నికో ష్లోటర్బెక్ అద్భుత గోల్ చేయగా.. తొలి అర్ధభాగం ముగిసేలోపు లభించిన పెనాల్టీని కై హావెర్ట్జ్ గోల్‌గా మలిచాడు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి జర్మనీ 3-1 ఆధిక్యంలో నిలిచింది.
సెకండ్ హాఫ్‌లో వన్-సైడ్.. రెండో అర్ధభాగంలో జర్మనీ పూర్తిగా గేర్ మార్చి కురాకోకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుస గోల్స్ సాధించింది. 53వ నిమిషంలో స్టార్ ప్లేయర్ జమాల్ ముసియాలా క్లాసిక్ గోల్‌తో
స్కోర్లు 4-1 కాగా.. 68వ నిమిషంలో నాథనియెల్ బ్రౌన్ అందించిన సూపర్ గోల్‌తో 5-1.. అలాగే 78వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన డెనిజ్ ఉండావ్ చేసిన మెరుపు గోల్ తో జర్మనీ జట్టు తిరుగులేని ఆధిక్యంతో 6-1గా నిలిచింది.
చివరి గోల్ 88వ నిమిషంలో మ్యాచ్ ముగిసే సరిగ్గా రెండు నిమిషాల ముందు కై హావెర్ట్జ్ తన వ్యక్తిగత ఖాతాలో రెండో గోల్ నమోదు చేసి జర్మనీ విజయాన్ని 7-1తో ఖరారు చేశాడు. జర్మనీ తమ తదుపరి మ్యాచ్‌ను అమెరికాలోని టొరొంటో స్టేడియంలో జూన్ 21న ఐవరీ కోస్ట్ జట్టుతో తలపడనుంది.
మొదటి మ్యాచ్‌లోనే 7 గోల్స్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న జర్మనీ.. ఇదే ఆత్మవిశ్వాసంతో జూన్ 21న ఐవరీ కోస్ట్‌తో తలపడనుంది. మరోవైపు, ఐవరీ కోస్ట్ జూన్ 15న (ఈరోజు) ఈక్వడార్తో జరిగే తమ తొలి మ్యాచ్‌లో గెలిచి టోర్నీని విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.