
• భారతదేశంలో సింగపూర్‌కు ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలను వివరించిన శిల్పక్ అంబులే • ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలన్న సీఎం చంద్రబాబు • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరిన సీఎం • ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వివరించిన సిఎం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... • షిప్ బిల్డింగ్‌కు, సివిల్ ఏవియేషన్‌లో ఎంఆర్వో కేంద్రాలు నెలకొల్పేందుకు అవకాశాలు ఉన్నాయి • ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నాం.
20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి రైతులు ముందుకొచ్చారు. • ప్రపంచ స్థాయి నాణ్యమైన ఉత్పత్తులు ఏపీలోని రైతులు పండిస్తున్నారు. హార్టికల్చర్ పంట ఉత్పత్తులు ఎగుమతులు చేసే స్థాయిలో ఉన్నాం. ఆహార రంగంలో ట్రేసబులిటీ స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం.
• రోబోటిక్స్, మెడికల్ డివైసెస్, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో సహకారం కోరుతున్నాం • సింగపూర్ టెక్ రంగ అవసరాలు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ యువత సిద్ధంగా ఉంది • అభివృద్ది కార్యక్రమాలు, పెట్టుబడుల విషయంలో పొలిటికల్ సిస్టం, బ్యూరోక్రసీలో జాప్యం లేకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారు. • పెట్టుబడులతోనే అభివృద్ది, సంపద సృష్టి, ఉద్యోగ, ఉపాధి సాధ్యం అవుతుంది.
భారతదేశాన్నినెంబర్ 1 చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. • ఎపిలో పెట్టుబడుల విషయంలో ప్రధాని చొరవ కారణంగా ప్రపంచ స్థాయి సంస్థలు ఏపికి వచ్చాయి. • హిందూ గ్రోత్ రేట్ 1 నుంచి 2 శాతం మాత్రమేఅని ఒకప్పుడు హేళన చేసేవాళ్లు...ఇప్పుడు పరిస్థితి మారింది.
ఏ రంగంలో పెట్టుబడులకు అయినా భారతదేశం సిద్దంగా ఉంది. పాలసీలు, సాంకేతిక నిపుణులు, అవసరమైన ఎకో సిస్టంతో ప్రధాని దేశాన్ని పెట్టబడులకు సిద్దంగా ఉంచారు. • సింగపూర్ విశ్వవిద్యాలయాలు–ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యానికి సీఎం విజ్ఞప్తి ఈ సందర్భంగా అంబులే మాట్లాడుతూ...
, సెమీ కండక్టర్ ఎకో సిస్టంలో సింగపూర్ చాలా ముందు ఉంది • భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో సింగపూర్ కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉంది. • ఎపిలో పెట్టుబడులకు అసవరమైన సహకారాన్ని అందిస్తాం
• గ్రీన్ ఎనర్జీ