Bengaluru Byadarahalli Woman Murder : కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బ్యాదరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 22 ఏళ్ల యువతి తన అద్దె ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఆమె ప్రియుడిని ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అయితే అతడు కూడా.. సదరు యువతి మృతదేహం పక్కనే స్పృహ తప్పిన స్థితిలో పడి ఉండగా.. పోలీసులే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే అమ్మాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి.. వీరికి ఏమైందనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఆపూర్తి వివరాలు మీకోసం. పెళ్లి సంబంధం కుదర్చడమే కారణమా?హతురాలిని మగాడి మెయిన్ రోడ్డు సమీపంలోని తులసి నగర్లో నివసిస్తున్న 22 ఏళ్ల ఎస్ భవానిగా పోలీసులు గుర్తించారు. ఆమె ప్రస్తుతం చదువుకుంటూనే.. ఒక మొబైల్ షోరూమ్‌లో బిల్లింగ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది.
అయితే భవాని తండ్రి శ్రీనివాస్ వృత్తిరీత్యా వంట మాస్టర్ కాగా.. కుమార్తె హత్య విషయం తెలుసుకుని పోలీసులకు సంచలన ఫిర్యాదు చేశారు. తన కుమార్తె భవాని, చంద్రశేఖర్ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఇటీవలే తమకు తెలిసిందని చెప్పారు. అయితే తాను కూతురి ప్రేమను నిరాకరించి..
ఆమెకు మరొక వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుని సంబంధాలు చూడడం ప్రారంభించినట్లు వివరించారు. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం తమ కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూపులో భవాని, చంద్ర శేఖర్‌లకు సంబంధించిన ఒక ఫోటో షేర్ అయినట్లు ఆయన పేర్కొన్నారు.
దీన్ని చూసి ఆందోళన చెందిన తాను.. కుమార్తెకు భవానికి ఫోన్ చేశానని.. కానీ అప్పటికే ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ అని వచ్చిందని పోలీసులకు వివరించారు."నీ కూతురిని చంపేశా".. తండ్రికి నిందితుడి ఫోన్!అయితే కూతురి ఫోన్ కలవకపోవడంతో.. శ్రీనివాస్ నేరుగా నిందితుడైన చంద్రశేఖర్‌కు ఫోన్ చేశారు.
ఫోన్ చేసి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. "నేను నీ కూతురిని చంపేశాను.. నువ్వు ఏం చేసుకుంటావో చేస్కో.. నేనే స్వయంగా పోలీసులకు సమాచారం ఇస్తాను" అని బెదిరించినట్లు ఎఫ్ఐఆర్లో వివరించారు. ఈ ఫోన్ కాల్‌తో హతాశుడైన తండ్రి.. వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. ఇంటి లోపలి నుంచి లాక్ చేసి ఉండటం, ఎంత పిలిచినా పలకకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.రక్తపు మడుగులో భవాని మృతదేహం.. పక్కనే అపస్మారక స్థితిలో ప్రియుడుశుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా.. భవాని గదిలో రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె పక్కనే చంద్రశేఖర్ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. వెంటనే భవానిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ప్రాథమిక విచారణ ప్రకారం ఏదో వ్యక్తిగత వివాదం కారణంగానే నిందితుడు పదునైన ఆయుధంతో భవానిని గొంతు కోసి లేదా పొడిచి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈక్రమంలోనే భారతీయ న్యాయ సంహితలోని హత్య సెక్షన్ల కింద బ్యాదరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షలకు తరలించారు. కాగా నిందితుడు చంద్రశేఖర్ ఏ పరిస్థితుల్లో స్పృహ కోల్పోయాడు, అతను ఏదైనా విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి వైద్య నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మొదట కాల్స్ ఎత్తని నిందితుడు.. ఆ తర్వాత తిరిగి భవాని తండ్రికి