
ఇంటర్నెట్ డెస్క్: ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి సూపర్ హిట్ సిరీస్లకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ఇప్పుడు బాలీవుడ్లో భారీ సినిమాకు సిద్ధమవుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘‘ఒక హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ ఇప్పుడే మొదలైంది, అది ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. మరో సిరీస్ కూడా అభివృద్ధి దశలో ఉంది. మా హిందీ సినిమా నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది’’ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలోపెట్టుకొని, భారీ బడ్జెట్తో ఈ సూపర్ సినిమా రూపొందిస్తున్నారు.
అక్టోబర్లో ఈ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటిస్తారని సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలోనూ ఈ సినిమా గురించి వార్తలు ప్రచారమయ్యాయి. ఈ చిత్రంలో రాజ్ భార్య సమంత (samantha) హీరోయిన్గా నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
అయితే, వాటిని రాజ్ సన్నిహిత వర్గాలు కొట్టిపారేశాయి. ఇక, సల్మాన్ ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు కాంబినేషన్లో వస్తున్న ‘SVC63’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.