
Sreeleela:బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, నటి శ్రీలీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ కలిసి నటిస్తున్న కొత్త సినిమా కూడా ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా షూటింగ్ సన్మానంలో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అన్న వార్తలు వినిపించగా..
ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త అందుకు ఆర్జ్యం పోస్తోంది. బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ తాజాగా నటి శ్రీలీలకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. జూన్ 15న 25వ పుట్టినరోజు జరుపుకున్న శ్రీలీలకు కార్తీక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా విషెస్ చెప్పడంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కార్తీక్ షేర్ చేసిన ఫొటోలో ఆయన బైక్ నడుపుతుండగా, వెనుక సీట్లో శ్రీలీల కూర్చొని కనిపించింది. ఇద్దరూ బైక్ అద్దంలోకి చూస్తూ చిరునవ్వులు చిందించారు. ఈ ఫొటోకు కార్తీక్ “హ్యాపీ బర్త్‌డే శ్రీ శ్రీ” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి స్పందించిన శ్రీలీల “థ్యాంక్యూ స్వీటెస్ట్” అని కామెంట్ చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
గత కొంతకాలంగా కార్తీక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వీరి పోస్ట్‌లు, కామెంట్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ప్రస్తుతం కార్తీక్, శ్రీలీల కలిసి ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఓ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రాన్ని టీ-సిరీస్ నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా శ్రీలీల బాలీవుడ్లో అడుగుపెడుతోంది.
2026 చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కార్తీక్ ఆర్యన్ కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల ఆయన రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించాడు. అలాగే “నాగ్జిల్లా” అనే ఫాంటసీ కామెడీ అడ్వెంచర్ సినిమాలో కూడా కనిపించనున్నాడు. భారతీయ జానపద కథల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది
.
శ్రీలీల ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. కార్తీక్‌తో కలిసి నటిస్తున్న కొత్త సినిమా ఆమె కెరీర్లో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.