
Samantha: ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో ఒక సినిమా ఎంత అద్భుతంగా తెరకెక్కించామన్నది ఎంత ముఖ్యమో.. దాన్ని ప్రేక్షకుల గుండెల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లామన్నది కూడా అంతే కీలకంగా మారింది. మరీ ముఖ్యంగా ఓటీటీ (OTT) విప్లవం వచ్చాక, ప్రేక్షకులు థియేటర్ల వైపు రావాలంటే ప్రమోషన్ల ద్వారా క్రియేట్ చేసే హైప్ చాలా అవసరమవుతోంది.
అందుకే ఇప్పటి తరం మేకర్స్ సరికొత్త ప్రచారాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ రేసులో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక కళ్లు చెదిరే సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. Read also: CM Vijay Divorce Case: విజయ్ విడాకుల కేసులో నేడే కీలక విచారణ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’.
జూన్ 19వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సమంత ప్రమోషన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి… కేవలం ఒకే ఒక్క రోజులో ఏకంగా 40 వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.
సాధారణంగా ఒక సినిమా ప్రమోషన్స్ అంటే హీరో హీరోయిన్లు నాలుగైదు ఇంటర్వ్యూల్లో పాల్గొనడమే ఎక్కువ. కానీ సమంత మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు నాన్‌స్టాప్‌గా 40 డిజిటల్, లీడింగ్ మీడియా ఛానెళ్లకు వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చారు. టాలీవుడ్ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డని, సామ్ డెడికేషన్‌కు ఇది నిదర్శనమని సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు.
ఇందులో సమంత ఎలాంటి డూప్ సహాయం తీసుకోకుండా, కేవలం చీరకట్టులోనే భీకరమైన యాక్షన్ సీన్లు చేయడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 20 నిమిషాల పక్కా రన్టైమ్తో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్కు ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.
America-Iran War: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Peddi Latest Collections : రూ.400 కోట్ల మార్క్ దిశగా ‘పెద్ది’ పరుగు
aaranasi Movie : వైజాగ్ లో ‘వారణాసి’ షూటింగ్
Drishyam 3 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న దృశ్యం 3 ..ఎప్పుడంటే?
Peddi: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ వసూళ్ల ప్రభంజనం.. తొమ్మిది రోజుల్లో వసూళ్లు ఎంతంటే..?
Sharwanand: శర్వానంద్ ‘భోగి’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభం
భారీ ప్రమోషన్స్‌తో అంచనాలు పెంచేసిన