
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మెగా కన్వెన్షన్ 2026’లో భాగంగా జులై 17, 2026న ప్రత్యేకమైన ‘బ్యాంక్వెట్ నైట్’ (Banquet Night) వేడుకలను ఏర్పాటు చేస్తున్నారు. నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ కార్యక్రమం, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహిస్తున్నారు.
ప్రధాన ఆకర్షణ.. ఈ వేడుకల్లో భాగంగా ప్రసిద్ధ ‘ఆరెంజ్ స్ట్రీట్ మ్యూజిక్ బ్యాండ్’ (Orange Street Music Band) లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు , రిజిస్ట్రేషన్ కోసం అధికారిక వెబ్సైట్ ttaconvention.orgని సందర్శించవచ్చు.
అమెరికాలో ఉన్న వేలాది మంది తెలుగు కుటుంబాలు ఒకచోట చేరి, ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచుకోవడానికి ఈ కన్వెన్షన్ ఒక వేదిక కానుంది
.