
మాళవిక మోహనన్ (Malavika Mohanan) చాలా సినిమాల్లో నటించింది. హిందీలో సినిమాలు చేసింది. తమిళ్ లో నటించింది. మాతృభాష మలయాళంలో మెరిసింది. ఈ ఏడాది తెలుగులో కూడా కనిపించింది. ఐతే, అన్ని భాషల్లో కన్నా తమిళ దర్శకులే తనను నటిగా బాగా చూపించారని చెప్తోంది.
తమిళ్ లో “మాస్టర్”, “తంగళన్”, “మారన్” “పెట్టా” వంటి సినిమాల్లో నటించింది. కార్తీక్ సుబ్బరాజ్, పా రంజిత్, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకులు తమిళ్ లో తనకు మంచి పాత్రలు ఇచ్చారని చెప్తోంది. అంతే కాదు, ఒక యాక్టర్ పేరు తెచ్చుకోవాలంటే అది పూర్తిగా దర్శకుల ప్రతిభపైనే ఉంటుంది అని వివరించింది.
తెలుగులో ఆమె నటించిన ఏకైక చిత్రం.. ది రాజా సాబ్. ఈ సినిమాలో ఆమె ప్రభాస్ సరసన నటించింది. దర్శకుడు మారుతి సినిమానే పరంబోర్ గా తీశారు. ఇక హీరోయిన్లను గ్లామర్ గా చూపించడంలో తప్ప పాత్ర గురించి పట్టించుకునే ఆలోచన చెయ్యలేదు. అందుకే, ఆమె ఈ సినిమా విషయంలో ప్రభాస్ తో పాటు ట్రోలింగ్ కి గురి అయింది.
ఇక హిందీలో చేసిన సినిమాలు ఆమెకి పెద్ద ఫలితాలను ఇవ్వలేదు. అందుకే కాబోలు ఆమె తమిళ దర్శకులను ప్రత్యేకంగా పొగుడుతోంది. ప్రస్తుతం ఈ భామ తమిళ్ లో కార్తీ సరసన “సర్దార్ 2” సినిమాలో నటిస్తోంది. అలాగే పాకెట్ నావెల్ అనే మరో చిత్రం కూడా చేస్తోంది.
ఆమె చేతిలో ఉన్నవి రెండు చిత్రాలే. రెండూ తమిళ్ లోనే
.