డెలీవర్ బాయ్‌గా ఉద్యోగానికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పకుండా బయల్దేరుతాడు వెంకీ. మొదటిసారి అబద్దం ఆడాను.. అమ్మో చాలా కష్టంగా ఉంది అని వెంకీ అనుకుంటాడు. ఉద్యోగానికి వెళ్దామని బైక్ స్టార్ట్ చేయాలని అనుకుంటాడు వెంకీ. కానీ ఎంత కిక్ కొట్టినా బైక్ మాత్రం స్టార్ట్ కాదు.
దీంతో వెంకీ కంగారు పడతాడు. ఇంతలో వెంకీకి కాల్ వస్తుంది. ఇంకెంత సేపు అవుతుంది.. ఆర్డర్లు వెయిట్ చేస్తున్నాయి.. త్వరగా రా అని చెబుతాడు బాస్. దీంతో వెంకీ మరింతగా కంగారు పడతాడుడ. మరో వైపు ఇందు ఇంటికి ఓ కొరియర్ వస్తుంది. ఏం ఉందో అని చూడాలని ఇందు ప్రయత్నిస్తుంది.
ఏంటి? చదివేద్దామనే అని రేఖ కౌంటర్లు వేస్తుంది. అందులో ఏం ఉంది ఇందు అని భ్రమరం అడుగుతుంది. అంత అమాయకంగా ఎలా అడుగుతున్నావ్.. ఇందుకి ఎలా తెలుస్తుంది.. చదువు రాదు కదా? అని శేషు అంటాడు. ఇందుకి చదువు వచ్చని తెలిస్తే అంతా ఎలా రియాక్ట్ అవుతారో..
చచ్చి ఊరుకుంటారేమో అని రాజు తనలో తాను అనుకుంటాడు. ఇక వచ్చిన పోస్ట్‌లో ఉన్న విషయాన్ని చూసి భూషణ్ షాక్ అవుతాడు.కంపెనీకి కొత్త సమస్య.. రా మెటీరియల్ సప్లై చేసే క్లైంట్‌కి మూడు నెలలుగా మనం పేమెంట్ చేయలేదు.. అందుకే ఇకపై సప్లై చేయడు అంట..
త్వరగా పేమెంట్ చేయమని నోటీసులు పంపాడు అని భూషణ్ చెబుతాడు. మన కంపెనీ మీద నమ్మకం పోయింది.. అందుకే ఇకపై పంపను అని అన్నాడు అంటూ రేఖ చెబుతుంది. ఎలా నమ్మకం ఉంటుంది.. అన్ని పేమెంట్స్ లేట్ చేస్తూనే వచ్చావ్ కదా అని అపర్ణ తిడుతుంది.
ఎంప్లాయిస్‌కి ఇవ్వడానికే డబ్బులు లేవంటే.. వాడికి ఎలా కట్టాలని రేఖ అడుగుతుంది. మరి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి.. ఏదైనా హెల్ప్ చెయ్యి ఆంటీ అని ఇందు అడుగుతుంది.జెట్ స్పీడులో పరిగెట్టిస్తా అన్నావ్.. నిన్నటి డీల్ చేసి ఉంటే..
డబ్బులు
వచ్చేవి.. ఈ రోజు వాడికి మనం కట్టే వాళ్లం.. కానీ మీ ఆయన హీరోలా దాన్ని చించేశాడు కదా.. అయినా నీ బాధ్యత, కంపెనీ బాధ్యత రాజుదే కదా.. కంపెనీని పరుగులు పెట్టిస్తా అన్నాడు కదా.. మీరే చూసుకోండి అని రేఖ అంటుంది. మా రేఖను మీరు ఎన్ని మాటలు అన్నారు.. కంపెనీ అన్నాక నష్టాలు, లాభాలు వస్తాయి.. రాజు పెద్ద మాటలు చెప్పాడు కదా.. జెట్ స్పీడులో కంపెనీని పరుగులు పెట్టిస్తా అని ఇప్పుడు మీరే చూసుకోండి అని భ్రమరం అంటుంది.ఈ సమస్య ఇకపై మీదే.. ఏంటి? అల్లుడు ఇలా సైలెంట్‌గా ఉన్నావ్ అని శేషు అంటాడు. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు అని రాజు అంటాడు. ఇకపై ఈ సమస్య మీదే.. నాకేం సంబంధం లేదు అన్నట్టుగా రేఖ మాట్లాడుతుంది. ఈ నోటీసులు చూసి పిల్లాడికి షాక్ కొట్టినట్టుందని భూషణ్ కౌంటర్లు వేస్తాడు. నా వల్ల ఎదుటి వారికి కొడుతుంది కానీ నాకు కొట్టదు అని రాజు అంటాడు. ఇక ఈ సమస్యని మేం చూసుకుంటాం అని రాజు అంటాడు. మీరే కంగారు పడకండి అమ్మమ్మ, తాతయ్య.. అని రాజు ధైర్యం చెబుతాడు.ఎందుకు అలా చూస్తున్నావ్.. ఇంకో వైపు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా? అని రాజు, ఇందు ఆలోచిస్తుంటారు. ఐడియా వచ్చిందని ఇందు వద్దకు వస్తాడు రాజు. దూరం జరుగు అని అరిచేస్తుంది ఇందు. ఏం ఐడియా అని ఇందు అంటే.. నువ్వు అరిచిన అరుపులకు మర్చిపోయా అని రాజు అంటాడు. ముందు మన సమస్య గురించి ఆలోచించు అని ఇందు అంటే.. ఇందు మొహంలో మొహం పెట్టి చూస్తాడు రాజు. ఏయ్.. ఏంటి అలా చూస్తున్నావ్ అని ఇందు అంటుంది. ఎలా చూస్తున్నాను అని రాజు అడుగుతాడు. అలానే అని ఇందు అంటుంది. అందమైన మొహాన్ని చూస్తే ఐడియా వస్తుందంట.. అందుకే చూస్తున్నాను అని రాజు అంటాడు.సిగ్గు పడ్డ ఇందు.. నువ్వు అందంగా లేకపోయినా సరే.. అందంగా ఉన్నావ్ అని ఊహించుకుని మరీ చూస్తున్నా అని రాజు కౌంటర్లు వేస్తాడు. ఏయ్.. నిజంగానే నేను అందంగా లేనా? అని ఇందు అంటుంది. నన్ను తిట్టొద్దు, పేమెంట్ కట్ చేయొద్దు ఓకేనా.. నువ్వు చాలా అందంగా చందమామలా ఉన్నావ్ అని రాజు పొగిడేస్తాడు. దీంతో ఇందు సిగ్గు పడుతుంది. మనకు ఇంత పెద్ద సమస్య ఉంది.. అందం గురించి పొగడగానే.. అన్నీ మర్చిపోయి.. సిగ్గు పడుతున్నావా? అని ఇందుని అంటాడు రాజు. సరేలే ఈ సమస్య ఎలా బయటపడాలి అని రాజు, ఇందు అనుకుంటారు.ప్లాన్ వేసిన సుభాష్.. కంపెనీలో మనకు సపోర్ట్ చేసే క్లైంట్స్ ఎవరు? అన్నది తెలుసుకోవాలి అని సుభాష్ సలహా ఇస్తాడు. అదెలా తెలుసుకోవడం అని ఇందు అనుకుంటుంది. ఓ పార్టీ చేద్దాం.. ఆ పార్టీకి వచ్చిన వారిలో మన వారు ఎవరు.. రేఖ మనుషులు ఎవరు? అన్నది తెలుస్తుంది.. తెలిశాక మన క్లైంట్స్తో కొత్త డీల్స్ చేసుకుందాం.. కంపెనీని సమస్యల నుంచి బయట పడేయొచ్చు అని సుభాష్ సలహా ఇస్తాడు. మరి పార్టీకి రేఖని ఎలా ఒప్పించాలని అంతా అనుకుంటారు. నీ ఫ్రెండ్ శకుంతలను రంగంలోకి దించి.. రేఖను రెచ్చగొడదామని ఇందు ప్లాన్ వేస్తుంది. ఇక మరో వైపు వెంకీ సైకిల్ మీద డెలివరీలకు వెళ్తుంటాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.