
కేరళలో తాజాగా జరిగిన ఓ ఆరెస్సెస్ ఈవెంట్ కు రాష్ట్రంలోని మూడు యూనివర్శిటీల వీసీలు (ఉపకులపతులు) హాజరు కావడం చర్చనీయాంశమైంది. వీసీలుగా ఉన్న వారు ఆరెస్సెస్ ఈవెంట్ కు హాజరు కావడంపై అక్కడి యూడీఎఫ్ సర్కార్ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం వీడీ సతీశన్ (VD Satheesan) ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో స్పందించారు.
వీసీలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సతీశన్ డిమాండ్ చేశారు.జూన్ లో కేరళ ట్రిప్.. ప్రకృతి ఒడిలో రీఫ్రెష్..!ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ కు అధినేత మోహన్ భగవత్ తో పాటు పలువురు హాజరయ్యారు. ఇందులో రాష్ట్రంలోని కేరళ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, మలయాళం యూనివర్సిటీల వైస్-ఛాన్సలర్లు పాల్గొన్నారు.
దీనిపై విమర్శలు రావడంతో సీఎం సతీశన్ స్పందించారు. సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ప్రసంగించిన ఆరెస్సెస్ శతాబ్ది కార్యక్రమంలో ముగ్గురు వైస్-ఛాన్సలర్లు పాల్గొనడాన్ని తాము అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఇది తీవ్రమైన తప్పిదమని తెలిపారు.
వారి చర్య కేరళ విద్యా సంప్రదాయానికి , వారి పదవికి ఉండే గౌరవానికి తగనిది అన్నారు.కాంగ్రెస్ లో విలీనం దిశగా పిల్ల కాంగ్రెస్ లు..! జగన్ వైఖరి మారుతోందా ? కేరళ ప్రజలు వైస్-ఛాన్సలర్ పదవిని ఎంతో గౌరవంగా భావిస్తారని, అయితే ఆరెస్సెస్ కార్యక్రమంలో ఈ ముగ్గురు విద్యావేత్తలు పాల్గొనడం ఆ ప్రజా విశ్వాసాన్ని బలహీనపరిచిందని సతీశన్ తెలిపారు తీవ్రమైన మతతత్వాన్ని ప్రచారం చేసే ఆరెస్సెస్ నాయకుడి నేతృత్వంలోని కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వారు ఆ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు.
మతతత్వ రాజకీయాలకు చట్టబద్ధత కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ముఖ్యమంత్రి.. ఎవరు బాధ్యులైనప్పటికీ ఇటువంటి చర్యలను అంగీకరించలేమని స్పష్టం చేశారు.అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముగ్గురు వైస్-ఛాన్సలర్లు కేరళ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సతీశన్ డిమాండ్ చేశారు
.