
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేడు సింగపూర్‌లోని భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని, ఇక్కడి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని చంద్రబాబు కోరారు.
భారతదేశానికి, సింగపూర్‌కు మధ్య ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలను ఈ సందర్భంగా హై కమిషనర్ అంబులే ముఖ్యమంత్రికి వివరించారు.ఈ భేటీలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
షిప్ బిల్డింగ్, సివిల్ ఏవియేషన్‌లో ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కూడా రాష్ట్రం అనుకూలంగా ఉందని వివరించారు. ఏపీలో 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని, ప్రపంచ స్థాయి నాణ్యతతో హార్టికల్చర్ ఉత్పత్తులను పండిస్తున్నారని, వీటి ఎగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు.
సింగపూర్ టెక్నాలజీ రంగ అవసరాలు తీర్చగల నైపుణ్యం ఏపీ యువతకు ఉందని, రోబోటిక్స్, మెడికల్ డివైసెస్ రంగాల్లో సహకారం అందించాలని కోరారు.ప్రధాని మోదీ నాయకత్వంలో దూసుకెళ్తున్న భారత్‌ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని చంద్రబాబు ప్రశంసించారు. పెట్టుబడులతోనే సంపద సృష్టి, ఉద్యోగ కల్పన సాధ్యమని, భారతదేశాన్ని నెంబర్ 1 చేయాలనే లక్ష్యంతో ప్రధాని పనిచేస్తున్నారని కొనియాడారు.
ఒకప్పుడు 'హిందూ గ్రోత్ రేట్' అంటూ 1-2 శాతం వృద్ధిని హేళన చేసేవారని, కానీ