
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. BJP strategy on Rajya Sabha: భారతీయ జనతా పార్టీ గత 17 లోక్‌సభలో మహిళ బిల్లును ఆమోదించింది. ఇది నియోజకవర్గాల పునర్విభజనకు లింక్ పెడుతూ డీ లిమిటేషన్ తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్వభిజన తర్వాత కానీ మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ వర్తించదు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు.. మహిళాబిల్లు, డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెడుతూ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు ఒకే చెప్పినా.. అందుకోసం జరుగుతున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మాత్రం ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
దీంతో ఈ బిల్లు లోక్ సభ మూడింటి రెండొంతల మెజారిటీ లేక బిల్లు వీగిపోయింది. దీంతో నరేంద్ర మోడీ సర్కారు రాబోయే రోజుల్లో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదం కోసం తన వ్యూహాలకు పదును పెట్టింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు బీజేపీలో విలీనం కావడంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది.
ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పార్టీలో ముసలం పుట్టింది. దీంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి తమను ప్రత్యేకంగా గుర్తించాలని చెబుతూ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ అందించారు. ఇక లోక్ సభలో కూడా 20 మంది తృణమూల్ పార్టీ ఎంపీలు తమను ప్రత్యేకంగా గుర్తించాలంటూ తమ పార్టీని నేషనల్ సిటీజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో
విలీనం చేశారు. అంతేకాదు తాము ఎన్డీయే మద్ధతు తెలుపుతున్నట్టు స్పీకర్ ఓం బిర్లాకు లేఖను అందజేశారు. అంతేకాదు తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని కోరారు.
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 148 మంది సభ్యులున్నారు. తాజాగా ఎగువ సభకు జరిగిన ఎన్నికల్లో పలు స్థానాలు ఏకగ్రీవం కావడంతో అందులో 19 సీట్లు ఎన్డీయేకు దక్కాయి. మరో 3 స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒక స్థానం ఎన్డీయే ఖాతాలో పడనుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. వాటిని ఉప ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. దాంతో ఎగువ సభలో ఎన్డీయే బలం 154కు పెరగనుంది. ఇప్పటికే రాజ్యసభలో మెజారిటీ మార్క్ దాటిన ఎన్డీయే 2/3 ఆధిక్యానికి 9 సీట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో మూడింటి రెండింతలు మెజారిటీకి 163 సభ్యుల మద్దతు అవసరం. దీంతో త్వరలో ఎగువు సభలో ఒకరి తర్వాత మరొకరు రాజీనామా చేయడం వలన పలు స్థానాలు బీజేపీ వశం కానున్నాయి. అటు ఎన్డీయే, ఇండియా కూటమిలోని సభ్యుల మద్దతు లభిస్తే.. రాజ్యసభలో ఎన్డీయేకు 2/3 మెజారిటీ స్థానాలైన 163కు చేరుకునే అవకాశాలున్నాయి.
అందులో 8 మంది డీఎంకే, 3 ఆప్.. ప్రతిపక్ష ఇండియా కూటమికి దూరం జరగడంతో రాజ్యసభలో విపక్షాల బలం 64కు పరిమితం అయింది. ఏ కూటమిలోని లేని పార్టీలు ఎటువైపైనా టర్న్ తీసుకునే అవకాశాలున్నాయి. ఇక టీఎంసీ నుంచి వేరుపడిన లోక్ సభ సభ్యుల మద్దతుతో దిగువ సభలో ఎన్డీయే బలం 313కు చేరుకోనుంది. మరోవైపు మహారాష్ట్రంలో శివసేనతో పాటు ఎన్సీపీకి చెందిన పార్టీ ఎంపీలు బీజేపీకి టచ్‌లో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక లోక్ సభలో 2/3 మెజారిటీ అంటే 363 మంది సభ్యుల బలం ఉండాలి. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉభయ సభల్లో బలం పుంజుకున్నాకా.. కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. అందుకే ఉభయ సభల్లో ప్రత్యేక వ్యూహాలతో బలం పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.