ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే విజయంలో దీప్తి శర్మ కీలకపాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు, బౌలింగ్‌లో ఐదు వికెట్లు సహా ఫీల్డింగ్‌లో ఒక రనౌట్ చేసి ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేసింది.
తద్వారా చిరకాల ప్రత్యర్థిపై విజయంలో దీప్తి శర్మ కర్త, కర్మ, క్రియగా నిలిచింది. ఈ నేపథ్యంలో దీప్తి శర్మ ఒక అరుదైన రికార్డు సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలిచింది.
పాక్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం ద్వారా 166 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. థాయ్‌లాండ్‌కు చెందిన తిపాట్చా పుత్తావాంగ్ (165 వికెట్లు) రెండో స్థానంలో ఉండగా, వాండాకు చెందిన హెన్రిట్టే ఇష్విమే (160 వికెట్లతో) మూడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ షట్ (152 వికెట్లు), థాయ్‌లాండ్‌కు చెందిన ఒన్నిచా కమ్చోఫూ (148 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి దీప్తి శర్మ ఇప్పటివరకు 354 వికెట్లు పడగొట్టింది. తద్వారా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. తొలి స్థానంలో భారత్‌కు చెందిన మాజీ బౌలర్ జులన్ గోస్వామి (355 వికెట్లు) ఉండగా, ఇంగ్లండ్‌కు చెందిన కేథరిన్ బ్రంట్ (335 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎలీస్ పెర్రీ (332 వికెట్లు), ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎసల్స్టోన్ (327 వికెట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
28 ఏళ్ల ఆమె మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారతదేశం తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేయగా, టోర్నమెంట్ చరిత్రలో ఏ బౌలర్ అయినా సాధించిన గణాంకాలలో ఇది మూడవ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఇక మ్యాచ్‌లో
Jun 15 2026 10:18 AM | Updated on Jun 15 2026 10:23 AM
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే విజయంలో దీప్తి శర్మ కీలకపాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో విలువైన పరుగులు, బౌలింగ్‌లో ఐదు వికెట్లు సహా ఫీల్డింగ్‌లో ఒక రనౌట్ చేసి ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేసింది.
తద్వారా చిరకాల ప్రత్యర్థిపై విజయంలో దీప్తి శర్మ కర్త, కర్మ, క్రియగా నిలిచింది. ఈ నేపథ్యంలో దీప్తి శర్మ ఒక అరుదైన రికార్డు సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలిచింది. పాక్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం ద్వారా 166 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది.
థాయ్‌లాండ్‌కు చెందిన తిపాట్చా పుత్తావాంగ్ (165 వికెట్లు) రెండో స్థానంలో ఉండగా, వాండాకు చెందిన హెన్రిట్టే ఇష్విమే (160 వికెట్లతో) మూడో స్థానంలో, ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ షట్ (152 వికెట్లు), థాయ్‌లాండ్‌కు చెందిన ఒన్నిచా కమ్చోఫూ (148 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి దీప్తి శర్మ ఇప్పటివరకు 354 వికెట్లు పడగొట్టింది. తద్వారా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. తొలి స్థానంలో భారత్‌కు చెందిన మాజీ బౌలర్ జులన్ గోస్వామి (355 వికెట్లు) ఉండగా, ఇంగ్లండ్‌కు చెందిన కేథరిన్ బ్రంట్ (335 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎలీస్ పెర్రీ (332 వికెట్లు), ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎసల్స్టోన్ (327 వికెట్లు) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.
28 ఏళ్ల ఆమె మహిళల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారతదేశం తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేయగా, టోర్నమెంట్ చరిత్రలో ఏ బౌలర్ అయినా సాధించిన గణాంకాలలో ఇది మూడవ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
ఇక మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత దీప్తి మాట్లాడుతూ ఈ ఘనత మొత్తం జట్టుకే చెందుతుందని చెప్పింది. తన విజయానికి హనుమాన్ జీ ఆశీస్సులు కూడా కారణమని పేర్కొంది. ఐసీసీ టోర్నమెంట్లు తనకు ప్రత్యేకమైనవని, అలాంటి వేదికలపై ఆడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపింది. స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్‌లపై బౌలింగ్ చేయడం తనకు ఎంతో ఇష్టమని, ప్రతి బంతికి వేగం మారుస్తూ సరైన ప్రాంతాల్లో బంతులు వేయడమే తన విజయ రహస్యమని వివరించింది.
'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)
ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)
‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
మహిళల జట్టు టి20 ప్రపంచకప్...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)
సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)
మా అమర్నాథ్ జోలికొస్తే.. నాలుక చీరేస్తాం..! వంగలపూడి అనితపై YSRCP నేతలు ఫైర్
గాలి ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఆరుగురు మృతి
సర్కార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ.. పోలీసుల కాల్పులు
భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజయం..