
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అయిన అనంతరం చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆ ట్వీట్లో మోదీ రెండుసార్లు వాడిన ‘నైస్’ అనే పదం వెనుక ఉన్న అర్థం ఏమిటన్న చర్చ నెటిజన్లలో మొదలైంది.
అలాగే అంతకు ముందు.. మాక్రాన్ కూడా అదే పదం వాడడం ఆసక్తిని రేకెత్తించింది. ఫ్రాన్స్‌లో మాక్రాన్‌తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్న మోదీ.. Nice to have met you in Nice అంటూ పోస్టు చేశారు. తొలి దశ సమావేశాలు ఫలవంతంగా సాగాయని, భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలో ఎవియన్, పారిస్‌లలో మళ్లీ కలుసుకుందామని కూడా పేర్కొన్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. మోదీ పోస్టుకు ముందు మాక్రాన్ కూడా అదే సెల్ఫీని షేర్ చేస్తూ కేవలం “Nice” అనే ఒక్క పదంతోనే స్పందించారు. దీంతో ఇద్దరు నేతల పోస్టుల్లో పదేపదే కనిపించిన ‘నైస్’ అనే పదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అసలు ఈ ‘నైస్’ ట్విస్ట్ వెనుక ఒక ఆసక్తికరమైన పదాల చమత్కారం దాగి ఉంది. ఇంగ్లిష్‌లో Nice అంటే బాగుంది, ఆనందంగా ఉంది అనే అర్థం వస్తుంది. అదే సమయంలో అది ఫ్రాన్స్‌లోని ప్రముఖ నగరం పేరు కూడా. అందుకే మోదీ అలా డబుల్ ట్విస్ట్ ఇచ్చారన్నమాట.
ఒకటి.. “మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అనే భావం. రెండోది.. “నైస్ నగరంలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అనే సందర్భోచిత సందేశం. మాక్రాన్ చేసిన నైస్ పోస్టు కూడా ఇదే తరహా ద్వంద్వార్థాన్ని ప్రతిబింబిస్తోంది. దీంతో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ఈ సరదా పదాల చమత్కారం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
అధికారిక దౌత్య సమావేశాల మధ్యలోనూ ఇలాంటి హాస్యభరిత సంభాషణ చోటుచేసుకోవడం విశేషమని పలువురు
Jun 15 2026 8:03 AM | Updated on Jun 15 2026 8:32 AM
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ అయిన అనంతరం చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆ ట్వీట్లో మోదీ రెండుసార్లు వాడిన ‘నైస్’ అనే పదం వెనుక ఉన్న అర్థం ఏమిటన్న చర్చ నెటిజన్లలో మొదలైంది. అలాగే అంతకు ముందు.. మాక్రాన్ కూడా అదే పదం వాడడం ఆసక్తిని రేకెత్తించింది.
ఫ్రాన్స్‌లో మాక్రాన్‌తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్న మోదీ.. Nice to have met you in Nice అంటూ పోస్టు చేశారు. తొలి దశ సమావేశాలు ఫలవంతంగా సాగాయని, భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఎవియన్, పారిస్‌లలో మళ్లీ కలుసుకుందామని కూడా పేర్కొన్నారు.
ఆసక్తికర విషయం ఏమిటంటే.. మోదీ పోస్టుకు ముందు మాక్రాన్ కూడా అదే సెల్ఫీని షేర్ చేస్తూ కేవలం “Nice” అనే ఒక్క పదంతోనే స్పందించారు. దీంతో ఇద్దరు నేతల పోస్టుల్లో పదేపదే కనిపించిన ‘నైస్’ అనే పదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ‘నైస్’ ట్విస్ట్ వెనుక ఒక ఆసక్తికరమైన పదాల చమత్కారం దాగి ఉంది.
ఇంగ్లిష్‌లో Nice అంటే బాగుంది, ఆనందంగా ఉంది అనే అర్థం వస్తుంది. అదే సమయంలో అది ఫ్రాన్స్‌లోని ప్రముఖ నగరం పేరు కూడా. అందుకే మోదీ అలా డబుల్ ట్విస్ట్ ఇచ్చారన్నమాట. ఒకటి.. “మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అనే భావం. రెండోది.. “నైస్ నగరంలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అనే సందర్భోచిత సందేశం.
మాక్రాన్ చేసిన నైస్ పోస్టు కూడా ఇదే తరహా ద్వంద్వార్థాన్ని ప్రతిబింబిస్తోంది. దీంతో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ఈ సరదా పదాల చమత్కారం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అధికారిక దౌత్య సమావేశాల మధ్యలోనూ ఇలాంటి హాస్యభరిత సంభాషణ చోటుచేసుకోవడం విశేషమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నైస్ ప్రత్యేకత ఏంటంటే.. నైస్(Nice City) ఫ్రాన్స్‌కు ఆగ్నేయ తీరంలో మధ్యధరా సముద్రం ఒడ్డున ఉన్న అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటి. ఫ్రెంచ్ రివేరా ప్రాంతానికి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ నగరం పర్యాటకులకు స్వర్గధామంగా భావిస్తారు. అందమైన బీచ్‌లు, సముద్రతీర విహార మార్గాలు, చారిత్రక నిర్మాణాలు, అంతర్జాతీయ సదస్సులకు ఇది ప్రసిద్ధి. ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. ఫ్రాన్స్‌లో పారిస్ తర్వాత అత్యధికంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించే నగరాల్లో నైస్ కూడా ఒకటి.
ధురంధర్ ట్విస్ట్ ఇచ్చిన మాక్రాన్ మోదీ పర్యటనకు బాలీవుడ్ టచ్ ఇస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరో ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో మోదీ పర్యటనకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ధురంధర్ సినిమాలోని ‘ఆరి ఆరి’ పాటతో జతచేసి వీడియోను రూపొందించారు. మోదీ-మాక్రాన్ భేటీ, భారత్ ఇన్నోవేట్స్-2026 సదస్సు ప్రారంభోత్సవం, ఇరు దేశాల మధ్య సాంకేతికత, ఆవిష్కరణలపై జరిగిన చర్చలను ఇందులో చూపించారు. ఈ వీడియోకు స్పందించిన ప్రధాని మోదీ.. భారత్, ఫ్రాన్స్‌లు సాంకేతికత, ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల రంగాల్లో కలిసి ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనల్లో భాగంగా ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారిక చర్చల కంటే ముందే మోదీ-మాక్రాన్ల సెల్ఫీ, దానికిచ్చిన ‘నైస్’ ట్విస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
మహిళల జట్టు టి20 ప్రపంచకప్...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)
సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)
యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)
సముద్రంలో మునిగిన భారత నౌక.. 14 మంది భారతీయులు..!
వాడిని చంపేస్తా...! మద్యం తాగి నడిరోడ్డుపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం
యుద్ధానికి తెర.. రెండు అంశాలకు కట్టుబడిన అమెరికా, ఇరాన్..
సిగ్గులేదా చంద్రబాబు.. ఇంకెంతకాలం దాచుకుంటావ్...!