
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Ram Charan Beats Chiranjeevi : అవును రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర్ ప్రసాద్ గారు’ సినిమా లైఫ్ టైమ్ వసూళ్లను కేవలం 10 రోజుల్లో క్రాస్ చేసి 2026లో తెలుగులో అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
ప్యాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమా కేవలం తెలుగులోనే మంచిగా పర్ఫామ్ చేసింది. మిగిలిన భాషల్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. బాలీవుడ్లో ఇలాంటి తరహా చిత్రాలు చాలానే వచ్చాయి. మరోవైపు మలయాళం, తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను ఓన్ చేసుకోలేకపోయారు.
పైగా నేటివిటీ సమస్య ఈ సినిమాకు పెద్ద మైనస్. ‘పెద్ది’ టైటిల్ తెలుగు వాళ్లకు కనెక్ట్ అయినట్టు ఇతర భాషల వాళ్లకు పెద్దగా ఎక్కలేదు. ఉన్నంతలో కన్నడలో మంచి పర్ఫామ్ చేస్తోంది. అది కూడా శివ రాజ్ కుమార్ వల్ల అక్కడ డీసెంట్ వసూల్లు దక్కాయి.
ఇక ఓవర్సీస్లో తెలుగులో డీసెంట్ వసూళ్లను రాబట్టింది. మన శంకర వర ప్రసాద్ గారు వసూళ్లను క్రాస్ చేసిన పెద్ది.. ఇక మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 184 కోట్ల షేర్ (రూ. 304.10 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.
ఇక పెద్ది ఈ టార్గెట్‌ను పది రోజుల్లో క్రాస్ చేసి ఔరా అనిపించింది. మొత్తంగా ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వర
ప్రసాద్ గారు’ చిత్రం తొలి హిట్ చిత్రంగా నిలిచి ఇప్పటి వరకు టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా ‘పెద్ది’ తో తన తండ్రి చిరు రికార్డు ను బ్రేక్ చేశారు.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 135.20 కోట్ల కు బిజినెస్ చేసింది. ఎట్టకేలకు ఇక పది రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 136 కోట్ల షేర్ (204 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఇక నిన్న ఆదివారం కలెక్షన్స్ కలిపితే.. దాదాపు రూ. 141 కోట్ల షేర్ (రూ. 213 కోట్ల గ్రాస్) వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లో సాధించి క్లీన్ హిట్‌గా నిలిచింది. ఇక ఓవర్సీస్లో 24 కోట్ల షేర్ (రూ.50 కోట్ల గ్రాస్)వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా పెద్దికి ఏమి రాలేదు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా నిన్నటితో కలిపి 190 కోట్ల షేర్ (రూ.315 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ఓవరాల్‌గా మరో రూ. 28 కోట్ల షేర్ రాబడితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. మొత్తంగా ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.