తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు గౌతమి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, తనకు అప్పగించిన ప్రచార ఉపకార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
ఈ మేరకు ఆదివారం నాడు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామికి తన రాజీనామా లేఖను పంపారు.రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, అంతర్గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గౌతమి పేర్కొన్నారు.
చాలా కాలం పాటు ఆలోచించిన తర్వాతే, సామాజిక సేవకు మరింత సమయం కేటాయించాలనే ఉద్దేశంతో బరువెక్కిన హృదయంతో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో వివరించారు. తాను పార్టీలో చేరిన నాటి నుండి నేటి వరకు తనకు పూర్తి సహకారం అందించిన మాజీ మంత్రులు, పార్టీ అధిష్ఠాన పెద్దలు, జిల్లా కార్యదర్శులు, వివిధ విభాగాల నిర్వాహకులు, పార్టీ శ్రేణులందరికీ ఆమె మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.
భవిష్యత్తులోనూ ప్రజాసేవ పట్ల తనకున్న నిబద్ధతను ఇలాగే కొనసాగిస్తానని స్పష్టం చేశారు.* వివాదాలు, విషాదాలను దాటుకుని బాక్సాఫీస్ విజేతగా... ‘దృఢం’ హీరో లైఫ్‌లో సినిమాని మించిన ట్విస్టులుటికెట్ దక్కకపోవడమే కారణమా?గౌతమి రాజకీయ ప్రస్థానం భారతీయ జనతా పార్టీతో ప్రారంభమైంది.
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీలో చురుగ్గా పనిచేసిన ఆమె, ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో 2023లో బయటకు వచ్చారు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో పళనిస్వామి సమక్షంలో అన్నాడీఎంకే కండువా కప్పుకున్నారు. పార్టీ ఆమెకు కీలకమైన ప్రచార బాధ్యతలను కూడా అప్పగించింది.
అయితే ఇటీవల ముగిసిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజపాళయం నియోజకవర్గం నుండి గౌతమి గట్టిగా ప్రయత్నించారు. కానీ స్థానిక సమీకరణాల రీత్యా అధిష్ఠానం ఆమెకు టికెట్ నిరాకరించింది. టికెట్ దక్కకపోయినప్పటికీ ఆమె పార్టీ
అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించినా, అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజా నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.చిత్ర పరిశ్రమలో సెకండ్ ఇన్నింగ్స్ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన గౌతమి ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కేవలం ప్రధాన పాత్రలకే పరిమితం కాకుండా, కథా బలమున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో మెరిపిస్తున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో ఆమె ఒక కీలక పాత్రలో మెరిశారు. సమంత నటిస్తూ నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రంలోనూ ఆమె కీలక పాత్రలో నటించారు. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి?ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే నుంచి పలువురు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్న తరుణంలో గౌతమి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే తన రాజీనామాకు గల ఖచ్చితమైన అంతర్గత కారణాలను మాత్రం ఆమె అధికారికంగా వెల్లడించలేదు. ఆమె భవిష్యత్తులో ఏదైనా కొత్త రాజకీయ పార్టీలో చేరతారా, లేక స్వతంత్రంగానే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. గౌతమి తదుపరి అడుగుపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.