
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ (Peddi) సినిమాలో జాన్వి కపూర్ పై పెట్టిన కెమెరా యాంగిల్స్ కొన్ని విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి షాట్స్ కొన్నింటిని కట్ చేశాడు దర్శకుడు బుచ్చిబాబు.
అదే టైమ్ లో మరికొన్ని అదనపు సన్నివేశాల్ని యాడ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. అయితే జాన్వి దృశ్యాలు కట్ చేశాడు కానీ, అదనపు సన్నివేశాలు జోడించలేదు. ఇన్నాళ్లకు ఆ టైమ్ రానే వచ్చింది. బుధవారం నుంచి ‘పెద్ది’ సినిమాలో ఎక్స్ ట్రా సీన్లు యాడ్ అవుతున్నాయి.
‘పెద్ది’ సినిమాకు అదనంగా 3 సీన్లు జోడించారు. వీటిలో 2 సన్నివేశాలు జాన్వి కపూర్, చరణ్ కలిసి నటించినవి కాగా.. ఇంకో సన్నివేశం చరణ్-జగపతిబాబు మధ్య బాండింగ్ సీన్. ఎక్కడైతే ప్రేక్షకులు వెలితి ఫీల్ అయ్యారో, అది పోగొడుతూ, ఈ సీన్స్ తో సినిమా పరిపూర్ణం అవుతుందంటున్నాడు దర్శకుడు.
సినిమాలో జాన్వి కపూర్ వల్ల చరణ్ పాత్రలో పరివర్తన వచ్చినట్టు చెప్పాలనుకున్నాడు బుచ్చిబాబు. కానీ ఫైనల్ కట్ లో అలాంటి సీన్లు తొలగించాడు. అదే టైమ్ లో జగపతిబాబు, చరణ్ పాత్రల మధ్య బంధాన్ని కూడా బలంగా చూపించలేకపోయాడు. తాజా సన్నివేశాలతో అవన్నీ కవర్ అవుతాయంటున్నాడు
.