
మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టు ఘనంగా బోణీ చేసింది. దాయాది పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే హర్మన్‌ప్రీత్ సేన అదరగొట్టింది. బ్యాటింగ్‌లో కాస్త తడబడినట్టు కనిపించినా.... మాంచెస్టర్: మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టు ఘనంగా బోణీ చేసింది.
దాయాది పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే హర్మన్‌ప్రీత్ సేన అదరగొట్టింది. బ్యాటింగ్‌లో కాస్త తడబడినట్టు కనిపించినా.. బౌలింగ్‌లో మాత్రం అంచనాలను అందుకుంది. స్నిన్నర్లు దీప్తి శర్మ (4-0-10-5), శ్రీచరణి (4-0-21-3) ప్రత్యర్థిని తమ మ్యాజిక్ బంతులతో చుట్టేశారు.
దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 170 పరుగులు చేసింది. స్మృతి మంధాన (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), హర్మన్‌ప్రీత్ (35 బంతుల్లో 4 ఫోర్లతో 36), రిచా ఘోష్ (17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) రాణించారు.
ఫాతిమా, సాదియాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పాక్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. మునీబా (35 బంతుల్లో 5 ఫోర్లతో 41), అలియా రి యాజ్ (18) మాత్రమే ఆకట్టుకున్నారు. కెరీర్ బెస్ట్ గణాంకా లు నమోదు చేసిన దీప్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
పేలవంగా..: భారీ ఛేదనను పాక్ మెరుగ్గానే ఆరంభించినా భారత స్పిన్నర్ల ధాటికి మధ్య ఓవర్లలో తడబడింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్ మునీబా మాత్రమే కాసేపు క్రీజులో నిలువగలిగింది. అయితే మరో ఓపెనర్ ఫిరోజా (12), ఆయేషా (12) సహకారంతో పవర్‌ప్లేలో 52 పరుగులతో ఫర్వాలేదనిపించింది.
కానీ దీప్తి రాకతో పాక్ లయ తప్పింది. తను వరుస విరామాల్లో వికెట్లు తీయగా.. శ్రీచరణి మరో ఎండ్ నుంచి పాక్ పనిబట్టింది. ఇక 17వ ఓవర్లో దీప్తి పాక్
చివరి ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చడంతో పాటు తన ఐదు వికెట్ల ఫీట్‌ను కూడా పూర్తి చేసింది. 31 రన్స్ తేడాతో పాక్ చివరి ఏడు వికెట్లను కోల్పోవడం గమనార్హం.
స్మృతి నిలకడ.. రిచా బాదుడు: పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాతో, టాస్ గెలిచిన వెంటనే బరిలోకి దిగిన భారత్‌ను పాక్ బౌలర్లు కట్టడి చేశారు. వికెట్లతో పాటు పరుగులను కూడా నియంత్రించడంతో ఆరంభంలో భారత్ స్కోరు నత్తనడకన సాగింది. అయితే రిచా ఘోష్ 19వ ఓవర్లో బాదిన హిట్టింగ్‌కు పాక్ ముందు సవాల్ విసిరే స్కోరును ఉంచగలిగింది. పాక్ చెత్త ఫీల్డింగ్ కూడా భారత్‌కు లాభించింది. మంధాన 24, 55 పరుగుల వద్ద ఇచ్చిన రెండు క్యాచ్‌లను పాక్ ఫీల్డర్లు పట్టలేకపోయారు. ఇక తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన ఓపెనర్ షఫాలీ (6)ని మొదటి ఓవర్లోనే స్పిన్నర్ సాదియా అవుట్ చేసింది. జెమీమా (1) కూడా నిరాశపర్చడంతో భారత్ పూర్తి డిఫెన్స్‌లో పడింది. మరో ఓపెనర్ మంధాన, హర్మన్‌ప్రీత్ ఆచితూచి ఆడడంతో పవర్‌ప్లేలో 38 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ అడపాదడపా బౌండరీలు సాధించడంతో స్కోరుబోర్డులో కాస్త కదలిక వచ్చింది. 12వ ఓవర్లో మంధాన రెండు ఫోర్లు బాది అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. తర్వాతి ఓవర్లో మంధాన 6, హర్మన్ 4,4తో 19 రన్స్ సమకూరాయి. కానీ జోరు మీదున్న మంధాన 14వ ఓవర్లో వెనుదిరగ్గా, మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం స్వల్ప వ్యవధిలో భార్తి (1), హర్మన్‌ల వికెట్లు కోల్పోగా 16-18 ఓవర్ల మధ్య ఒక్క బౌండరీ కూడా రాలేదు. దీంతో 150 స్కోరు కూడా కష్టమే అనిపించింది. కానీ రిచా 19వ ఓవర్లో 4,4,6,4,4 బాది 23 పరుగులు రాబట్టింది. చివరి ఓవర్లో తను అవుటైనా జట్టు మరో 15 రన్స్ సాధించగా 170 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది.
భారత్: షఫాలీ (సి) మునీబా (బి) సాదియా 6, మంధాన (సి) ఫాతిమా (బి) షమీమ్ 68, జెమీమా (సి) నటాలియా (బి) రుబాబ్ 1, హర్మన్ (సి) నటాలియా (బి) ఫాతిమా 36, భార్తి (స్టంప్) మునీబా (బి) సాదియా 1, రిచా (బి) ఫాతిమా 34, దీప్తి (నాటౌట్) 12, శ్రేయాంక (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 170/6; వికెట్ల పతనం: 1-6, 2-18, 3-109, 4-110, 5-123, 6-168; బౌలింగ్: సాదియా 4-0-41-2, ఫాతిమా సనా 4-0-33-2, తస్మియా 4-0-41-1, రమీన్ షమీమ్ 4-0-30-1, నష్రా 4-0-25-0.
పాకిస్థాన్: మునీబా (రనౌట్) 41, ఫిరోజా (సి) భార్తి (బి) దీప్తి 12, ఆయేషా (సి) మం ధాన (బి) దీప్తి 12, జబీన్ (సి) హర్మన్ (బి) శ్రీచరణి 2, నటాలియా (సి) హర్మన్ (బి) శ్రీచరణి 7, ఫాతిమా (సి) మంధాన (బి) షఫాలీ 0, ఆలియా (సి) జెమీమా (బి) దీప్తి 18, షమీమ్ (సి) శ్రేయాంక (బి) శ్రీచరణి 4, నష్రా (సి) హర్మన్ (బి) దీప్తి శర్మ 4, రుబాబ్ (సి) జెమీమా (బి) దీప్తి 0, సాదిక్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 17 ఓవర్లలో 106 ఆలౌట్; వికెట్ల పతనం: 1-38, 2-53, 3-58, 4-75, 5-77, 6-79, 7-91, 8-105, 9-105, 10-106. బౌలింగ్: అరుంధతి 2-0-21-0, శ్రేయాంక 3-0-17-0, క్రాంతి 1-0- 14-0, దీప్తి 4-0-10-5, శ్రీచరణి 4-0-21-3, షఫాలీ 3-0-22-1.
మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన ఏకైక బ్యాటర్‌గా షఫాలీ వర్మ
మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో భారత్ తరఫున ఎక్కువ రన్స్ (762) సాధించిన హర్మన్. మిథాలీ (726)ని అధిగమించింది
మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో భారత్ తరఫున ఎక్కువ హాఫ్ సెంచరీ (5)లు చేసిన బ్యాటర్‌గా మిథాలీ, హర్మన్‌లతో టాప్‌లో నిలిచిన మంధాన. అలాగే జట్టు తరఫున ఈ ఫార్మాట్లో ఎక్కువ సిక్సర్లు (87) బాది హర్మన్ (86)ను దాటేసింది
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు (166) తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ
ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు
పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే