
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన నెక్స్ట్ జనరేషన్ i20 కారును బ్రెజిల్లో విడుదల చేసింది. ఇప్పటివరకు స్పోర్టీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఉన్న i20, ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలోకి మారిపోయింది. ఈ కొత్త మోడల్ చూడటానికి ఒక క్రాసోవర్ లేదా చిన్న SUVలా కనిపిస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.కొత్త i20 డిజైన్‌ను పూర్తిగా మార్చేశారు.
బాక్సీ, యాంగ్యులర్ స్టైలింగ్‌తో పాటు, ముందు, వెనుక భాగంలో కనెక్టెడ్ ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్లను అమర్చారు. పాత మోడల్‌తో పోలిస్తే ఇది పరిమాణంలో కూడా చాలా పెద్దదిగా ఉంది. దీని పొడవు, వెడల్పు, వీల్‌బేస్‌ను పెంచారు. అయితే, ఈ కొత్త క్రాసోవర్ లుక్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
చాలామంది నెటిజన్లు పాత స్పోర్టీ లుక్‌తో పోలిస్తే ఈ డిజైన్ బాగోలేదని అభిప్రాయపడుతున్నారు.క్యాబిన్ లోపల రెండు 12.3-అంగుళాల భారీ స్క్రీన్లు (ఒకటి డిజిటల్ క్లస్టర్, మరొకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్), వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే, అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), వైర్లెస్ ఛార్జర్ వంటి అత్యాధునిక ఫీచర్లను అందించారు. బ్రెజిల్ మార్కెట్ కోసం 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను ఇచ్చారు.బ్రెజిల్లో ఈ కారు ప్రారంభ ధర మన కరెన్సీలో సుమారు రూ.
18.8 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 26.3 లక్షల వరకు పలుకుతోంది. ఈ మోడలే 2027 నాటికి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. అయితే, అధిక ధర, పన్నుల కారణంగా బ్రెజిల్ మోడల్‌ను నేరుగా